Saturday, 20 June 2020

Naga Shaurya: నాగశౌర్య ఫ్యామిలీకి కరోనా టెన్షన్.. ఆ మాట తెలియగానే అర్జెంట్‌గా!!

దేశంలో, రాష్ట్రంలో కరోనా మహమ్మారి ఉదృతి మరింత పెరిగింది. రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ రెట్టింపవుతుండటం జనాల్లో ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలోనే కరోనా సెగ టాలీవుడ్‌నీ తాకడంతో ఒక్కసారిగా అంతా ఉలిక్కిపడ్డారు. ప్రముఖ నిర్మాత, వ్యాపారవేత్త బండ్ల గణేష్ కరోనా బారిన పడటంతో టాలీవుడ్ అంతా అలర్ట్ అయింది. తనకు కరోనా సోకిందనే విషయం తెలియక చాలామందిని గత వారం రోజులుగా ఎంతోమందిని కలిశారు బండ్ల గణేష్. దీంతో ఆయనతో కాంటాక్ట్ అయిన వాళ్ళతో పాటు కుటుంబ సబ్యులకు కూడా కరోనా టెస్టులు చేస్తున్నారు. అయితే బండ్ల గణేష్ కరోనా బారిన పడ్డారనే విషయం తెలియగానే.. టాలీవుడ్ యంగ్ హీరో , ఆయన ఫ్యామిలీ మొత్తానికి టెన్షన్ పట్టుకుందని ఫిలిం నగర్ టాక్. Also Read: బండ్ల గణేష్ ఉండే వీధిలోనే నాగశౌర్య ఫ్యామిలీ కూడా నివాసముంటోంది. దాంతో ఆయనకు కూడా కరోనా భయం పట్టుకుందని అంటున్నారు. అంతేకాదు నాగశౌర్య ఫ్యామిలీ ప్రస్తుతం అక్కడి నుంచి వేరే చోటకు అర్జెంట్‌గా షిప్ట్ అయిపోయారని కూడా ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. బండ్ల గణేష్‌కి కరోనా పాజిటివ్ అని తెలిసి ఇంకొంతమంది టాలీవుడ్ ప్రముఖులు కూడా ఆందోళన చెందుతున్నట్లు సమాచారం.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/311Kw5W

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....