Sunday, 7 June 2020

రాహుల్ విజ‌య్ హీరోగా కొత్త సినిమా.. ఇదైనా కలిసొస్తుందా!

తెలుగు సినీ పరిశ్రమలో ఫైట్ మాస్టర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న విజయ్.. తన కుమారుడు రాహుల్ విజయ్‌ను 2018లో ‘ఈ మాయ పేరేమిటో’ చిత్రంతో హీరోగా పరిచయం చేశారు. తన కుమార్తె దివ్య విజయ్‌ను నిర్మాతగా పెట్టి ఈ సినిమాను విజయ్ స్వయంగా నిర్మించారు. తొలి సినిమాతో రాహుల్ పర్వాలేదనిపించారు. ఆ తరవాత నిహారిక కొణిదెలతో కలిసి ‘సూర్యకాంతం’ సినిమాలో రాహుల్ నటించారు. అయితే, ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. నటుడిగా మంచి మార్కులే సంపాదించిన రాహుల్‌కు ఈ రెండు సినిమాలు పెద్దగా బ్రేక్ అయితే ఇవ్వలేదు. అయితే, ఇప్పుడు మరో సినిమాతో ఈ యంగ్ టాలెంటెడ్ హీరో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ఆదివారం (జూన్ 7న) తన పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమాను ప్రకటించారు. రాహుల్ విజ‌య్ హీరోగా ఎస్‌కేఎల్ఎస్ గెలాక్సీ మాల్‌ ప్రొడ‌క్షన్స్ ప‌తాకంపై ప్రొడ‌క్షన్ నెం.1గా బృంద ర‌వీంద‌ర్ ద‌ర్శక‌త్వంలో ఇ. మోహ‌న్ నిర్మాత‌గా ఈ సినిమా రూపొందుతోంది. రాహుల్ విజ‌య్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈ చిత్రం నుంచి ఆయన లుక్‌ని విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌. మెలోడి బ్రహ్మ మ‌ణిశ‌ర్మ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ఈశ్వర్ ఎల్లుమహంతి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్. రాహుల్ తండ్రి విజయ్ స్టంట్ మాస్టర్. అనంత శ్రీరామ్ సాహిత్యం అందిస్తున్నారు. గుడిమిట్ల శివ ప్రసాద్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం బృంద రవీందర్. ఈ చిత్రానికి సంబంధించిన ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను త్వర‌లో వెల్లడించ‌నున్నారు. మరి, ఈ మూడో సినిమా అయినా ఆయనకు మంచి బ్రేక్ ఇస్తుందో లేదో చూడాలి. కాగా, పుట్టినరోజు సందర్భంగా రాహుల్ విజయ్‌కు పలువురు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2BBlbVv

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....