Saturday, 6 June 2020

గుడ్ న్యూస్ చెప్పిన లారెన్స్.. కరోనాని జయించిన ట్రస్ట్‌ అనాథ పిల్లలు

ప్రముఖ నటుడు, దర్శకుడు, డ్యాన్స్ మాస్టర్ నిర్వహిస్తున్న చారిటబుల్ ట్రస్ట్‌లో మహమ్మారి కలకలం రేపిన విషయం తెలిసిందే. లారెన్స్ నిర్వహిస్తున్న ఈ ఫౌండేషన్ లో 18 మంది పిలల్లకి, ముగ్గురు ఉద్యోగులకి కరోనా పాజిటివ్ రావడంతో ఆందోళకు గురిచేసింది. అయితే ట్రస్ట్‌కు చెందిన చిన్నారులందరూ కరోనా వైరస్‌ నుంచి కోలుకున్నారని రాఘవ లారెన్స్‌ తెలిపారు. లారెన్స్‌ నిర్వహిస్తున్న అనాథాశ్రమంలోని 18 మంది చిన్నారులకు, ముగ్గురు సిబ్బందికి కొవిడ్‌-19 ఉన్నట్లు వైద్యులు ఇటీవల నిర్ధారించారు. ఇప్పుడు వారంతా కోలుకోవడంతో లారెన్స్‌ సంతోషం వ్యక్తం చేశారు. ‘నా అభిమానులు, స్నేహితులకు నమస్కారం. ఓ మంచి విషయాన్ని మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. నా ట్రస్ట్‌లో ఉంటున్న కొంతమంది చిన్నారులు ఇటీవల కరోనా వైరస్‌ బారినపడిన విషయం తెలిసిందే. కొవిడ్‌-19 నుంచి కోలుకోవడంతో తాజాగా వాళ్లని డిశ్చార్జ్‌ చేశారు. ఈ సందర్భంగా ఎంతో సేవ చేసిన ఎస్పీ వెలుమణిగారికి, మంత్రివర్యులు జి. ప్రకాశ్‌గారికి, అలాగే డాక్టర్స్, నర్సులు అందరికీ కృతజ్ఞతలు. నా సేవే నా పిల్లలని కాపాడిందని భావిస్తున్నాను. నా పిల్లల కోసం ప్రార్థనలు చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సేవే దైవం’ అంటూ అనాథ పిల్లలతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేసుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు రాఘవ లారెన్స్‌.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2XBakDK

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....