Monday, 1 June 2020

రెండు సంప్రదాయాల్లో రానా పెళ్లి.. మూడు రోజుల పాటు వేడుక

దగ్గుబాటి కుటుంబంలో పెళ్లికళ వచ్చేసింది. టాలీవుడ్ హీరో చేసుకోబోతున్న విషయం తెలిసిందే. డిసెంబర్ కన్నా ముందే ఆగష్టులోనే రానా, మిహీకాల వివాహం జరిపించాలని కుటుంబసభ్యులు భావిస్తున్నారు. ఆగష్టు 8న వీరిద్దరికి పెళ్లి జరిపించి వివాహ బంధంతో ఒక్కటి చేయాలని భావిస్తున్నారు. కరోనా కారణంగా రానా పెళ్లి హైదరాబాద్‌లోనే జరిపేందుకు దగ్గుబాటి, బజాజ్‌ కుటుంబాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. రానాపెళ్లి వేడుకల్ని మూడు రోజులపాటు నిర్వహించనున్నట్లు సమాచారం. అంతేకాకుండా రానా మిహీకల పెళ్లి రెండు సంప్రదాయాల్లో జరగనున్నాయి. దగ్గుబాటి వారు తెలుగు సంప్రదాయం ప్రకారం.. బజాజ్ ఫ్యామిలీ మార్వాడి సంప్రదాయం ప్రకారం పెళ్లి వేడుకను జరపాలని భావిస్తున్నారు. అంతేకాదు పెళ్లి వేడుకను కూడా దాదాపు మూడు రోజుల పాటు నిర్వహించాలని ఇరు కుటుంబాల పెద్దలు నిశ్చయించారు. పెళ్లికి రెండు రోజుల ముందు ఆగస్టు 6, 7 తేదీల్లో వేడుకలు జరగబోతున్నాయి. కుటుంబ సభ్యులు, పరిమిత సంఖ్యలో సన్నిహితుల సమక్షంలో తెలుగు, మార్వాడీ సంప్రదాయాల ప్రకారం పెళ్లి వేడుకల్ని నిర్వహించనున్నారు. కరోనా ఎఫెక్ట్ కారణంగా ప్రభుత్వం విధించిన నియమ నిబంధనల మేరకే ఈ వేడుకని నిర్వహించాలని ఇరు కుటుంబాల వారు నిర్ణయించారు. ముహూర్తం నాటికి పరిస్థితుల్నిబట్టి వేడుకకి హాజరయ్యే అతిథుల సంఖ్య ఉండనుంది. రానాకి కాబోయే భార్య మిహీకా వెడ్డింగ్‌ ప్లానర్‌. దీంతో వారి పెళ్లికి స్వయంగా ఆమె ప్లాన్ చేస్తున్నారని సమాచారం. మిహీకా ఆలోచనలకు అనుగుణంగా, ప్రత్యేకమైన థీమ్‌తో పెళ్లి వేడుకలు జరగబోతున్నాయని తెలుస్తోంది. రానా సోషల్ మీడియా వేదికగా మిహీకాను పరిచయం చేసిన విషయం తెలిసిందే. స్నేహితులుగా ఉంటూ మనసులు ఇచ్చి పుచ్చుకున్న రానా, మిహీకా జంట తమ ప్రేమ విషయాన్ని పెద్దలకి చెప్పి ఒప్పించారు. ఇటీవలే ఇరు కుటుంబాల సమక్షంలో రోకా వేడుక జరిగింది. అయితే వీరిద్దరికి నిశ్చితార్థం నిర్వహించకుండా నేరుగా పెళ్లి చేయబోతున్నామని ప్రముఖ నిర్మాత, రానా తండ్రి డి.సురేష్‌బాబు మీడియాకు తెలిపారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Xorep9

No comments:

Post a Comment

'I Felt Enough Is Enough And Quit The BJP'

'All senior Muslim leaders of the BJP are left behind.' from rediff Top Interviews https://ift.tt/yCEdUhr