Monday, 1 June 2020

ముద్దుపెట్టి సెక్స్ చేశాక లవ్ ఉండదు.. ప్రేమంటే ఇదే అంటున్న స్టార్ దర్శకుడు

‘ప్రేమంటే ఏమిటంటే.. అది ప్రేమించినాక తెలిసే..’ అవును..!! ప్రేమంటే ప్రేమిస్తే కదా తెలిసేది. మనం కోరుకున్న ప్రేమ ఇదే.. ఇలాగే ఉంటుంది అని ఫిక్స్ అయితే ఎప్పటికీ అసలైన ప్రేమలోని ఆనందాన్ని రుచి చూడలేం.. నాయనా దర్శకా!! నిజమైన ప్రేమలో తాత్కాలిక కలహాలు ఎంత సహజమో.. సెక్స్, రొమాన్స్ కూడా అంతే. కాని అదే నిజమైన ప్రేమ అంటూ గొప్ప అర్థాన్ని ఇచ్చావు చూడా.. అబ్బా!! ప్రేమకు ప్రాణమే ఉంటే ఉరేసుకుని చచ్చిపోద్దేమో.! సర్లే.. కాని!! వివాదాల దర్శకుడు వర్మ ప్రేమకు గొప్ప అర్థాన్ని ఇచ్చారు. ఆయన దృష్టిలో ప్రేమంటే సెక్స్ అండ్ రొమాన్స్ అట.. ఆ ముద్దూ ముచ్చట్లు తీరితే ఆ తరువాత ఏం ఉండదు అంటున్నారు. మరి పెళ్లికి ముందు ఏళ్లకు ఏళ్లు కలిసి తిరిగి, తీరా పెళ్లి అయ్యాక పిల్లల్నికని షష్టి పూర్తి చేసుకుంటున్న వాళ్ల సంగతి ఏంటి అంటే.. దానికి వర్మ దగ్గర చక్కటి క్లారిఫికేషన్ కూడా ఉంది. అది వింటే నిజమే కదా అనిపించేట్టుగా ఉదహరిస్తున్నారు వర్మ. ఇంతకీ ఏమన్నారంటే.. ‘నా దృష్టిలో లవ్ అనేది ఓ ఫాల్స్ ఎమోషన్. అమ్మాయిలు అబ్బాయిలు సెక్స్ కోసం పడే బాధలకు లవ్ అనే పేరుపెడతారు. ఇద్దరి మధ్య సెక్స్ అయ్యాక.. లేదంటే పెళ్లి అయ్యాక ఇద్దరి మధ్య అసలు కలర్స్ బయటకు రావడం మొదలు పెడతాయి. లవ్‌లో ఉన్నప్పుడు ఏం చెప్పారు.. ఇప్పుడు ఏం చేస్తున్నారన్నవి బయటకు వస్తాయి. కుక్కలపైనా చిన్న పిల్లలపైనా లవ్ ఎక్కువగా ఉండటానికి కారణం ఏంటంటే.. అవి నీకు ఎదురు తిరిగే అవకాశం ఉండదు. ఎప్పుడైతే ఆపోజిట్ మైండ్ చాలా స్ట్రాంగ్ అయితే లవ్ చేయడం కష్టం అవుతుంది. ఎందుకంటే వాళ్లకి భిన్న అభిప్రాయాలు ఉంటాయి. టేస్ట్‌లు తేడా ఉంటుంది. వాళ్ల మూడ్స్ డిఫరెంట్‌గా ఉంటాయి. చిన్న పిల్లాడిని మనం పిలిచినప్పుడు వాడి డర్టీ లుక్స్ ఇస్తే వాడిపై మనకు ప్రేమ పోతుంది. ఎందుకంటే లవ్ అనేది మనం తీసుకోవడంలో నుంచి వస్తుంది. నువ్వు గొప్ప.. నువ్వు లేకపోతే నేను లేను అనే ఫీలింగ్ వచ్చినప్పుడు మాత్రమే లవ్ ఉంటుంది. కాని ఇలాంటి అభిప్రాయం ఎప్పుడూ ఉండటం అనేది జరగని పని. ‘నువ్వు లేకపోతే నేను.. జీవించలేను అనేది.. వాడు ముద్దు పెట్టుకోకముందు ఆమెతో సెక్స్ చేయకముందు అంటాడేమో కాని.. తరువాత కూడా అదే ఎమోషన్‌తో అంటాడా అంటే నాకు డౌటే. ఇది నేను ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నా.. నా మాటలు రిలేషన్ షిప్‌‌లో ఉన్న ప్రతి ఒక్కడికీ అర్థం అవుతుంది’ అంటూ ప్రేమకు అర్థం చెప్పారు .


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3cqQVJE

No comments:

Post a Comment

'I Felt Enough Is Enough And Quit The BJP'

'All senior Muslim leaders of the BJP are left behind.' from rediff Top Interviews https://ift.tt/yCEdUhr