Monday, 1 June 2020

నేనంటే సీఎం కేసీఆర్‌కి పుత్రవాత్సల్యం.. అలా అని ఉండరు: బాలకృష్ణ

నందమూరి vs మెగా బ్రదర్ నాగబాబు వివాదం తెలుగు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. కరోనా కల్లోల పరిస్థితులు, షూటింగ్స్ రీ ఓపెన్ విషయమై చిరంజీవి సహా సినీ పెద్దలంతా తెలంగాణ సీఎం కేసీఆర్‌ని కలవడంపై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. 'భూములు పంచుకుంటున్నారా?' అని ఆయన చేసిన కామెంట్ రచ్చకు కారణమైంది. దీంతో ఈ ఇష్యూలో ఎంటరైన నాగబాబు తనదైన కోణంలో మాట్లాడుతూ.. బాలకృష్ణ వెంటనే సినీ ఇండస్ట్రీకి, తెలంగాణ ప్రభుత్వానికి సారీ చెప్పాలి అని డిమాండ్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఇదే విషయంపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బాలకృష్ణ పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. గతంతో కేసీఆర్‌పై మీరు కొన్ని విమర్శలు చేశారు కదా. అందువల్లే పిలవలేదా? అని యాంకర్ అడిగిన ప్రశ్నపై స్పందించిన బాలకృష్ణ.. కేసీఆర్‌గారికి తన మీద కోపం ఉండి ఉండదని అన్నారు. అయినా అవి రాజకీయాలు కాదని చెప్పారు. కేసీఆర్‌ గారు రామారావుగారి అభిమాని అని, తానంటే ఆయనకు పుత్రవాత్సల్యం ఉందని తెలిపారు. ఆయనలా అని ఉండరని అన్నారు. కాకపోతే ఎందుకు పిలవలేదో మాత్రం తనకు తెలియదని ఆయన చెప్పారు. తనను వేరేగా చూస్తే మాత్రం తిక్కరేగుద్దని ఈ సందర్భంగా బాలకృష్ణ తెలిపారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2XnZHUJ

No comments:

Post a Comment

'It Has Been A Box Of Surprises'

'My journey has just been so different. Each character has been so different.' from rediff Top Interviews https://ift.tt/wluedtB