Saturday, 6 June 2020

సూపర్ మార్కెట్ సిబ్బంది టెంపరేచర్ చెక్ చేస్తున్న రవి బాబు

ప్రముఖ నిర్మాత, దర్శకుడు, ... స్టైలే వేరు. ఏదైనా సరే ఆయన కొత్త దనం కోరుకుంటారు. ముందుగా సినిమాల్లో విలన్‌గా, కామెడీ యాక్టర్‌గా నటించిన రవిబాబు.. ఆ తర్వాత సినిమాలకు దర్శకత్వం వహించడం ప్రారంభించారు. అమెరికా వెళ్లి ఆయన డైరెక్షన్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. నరేష్‌ను హీరోగా పరిచయం చేస్తూ ఆయన తీసిన అల్లరి సినిమా హిట్ టాక్ అందుకుంది. ఏది చేసిన తనకంటూ ప్రత్యేక గుర్తింపు వచ్చేలా చూసుకుంటారు రవిబాబు. తాజాగా కరోనా వైరస్ కారణంగా ఇంటికే పరిమితమైన రవిబాబు... ఓ సూపర్ మార్కెట్‌కు వెళ్లారు. అయితే కరోనా కారణంగా సూపర్ మార్కెట్ల, షాపుల వద్ద కస్లమర్లకు శానిటైజర్స్‌తో పాటు టెంపరేచర్స్ కూడా చెక్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే రవిబాబు వెళ్లిన సూపర్ మార్కెట్ వద్ద బయట సెక్యూరిటీ ఆయనకు టెంపరేచర్ చెక్ చేశాడు. అయితే రవి బాబు సైతం సెక్యూరిటీ టెంపరేచర్ చెక్ చేశారు. షాపింగ్ నిమిత్తం బయటకు వచ్చిన ఆయన తన వెంట శరీర ఉష్ణోగ్రత కొలిచే టెంపరేచర్ మిషన్ సైతం తీసుకొచ్చారు. ఈ దృశ్యాల్ని అక్కడున్నవాళ్లు రికార్డు చేసి సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో ఇప్పుడు ఈవీడియో తెగ వైరల్ అవుతోంది. దీనిపై హీరో మంచు మనోజ్ స్పందిస్తూ కేక అంటూ పోస్టు పెట్టారు. ప్రస్తుతం రవిబాబు ఎక్కువగా హరర్, సస్పెన్స్ సినిమాలపైనే ఫోకస్ పెట్టారు. ఇప్పటివరకు ఆయన దర్శకత్వం వహించిన హరర్ సబ్జెక్టులు అనసూయ మంచి విజయాన్ని అందుకుంది. ఇక అవును సినిమాలో రవిబాబు నటనతో అందర్నీ మెప్పించారు.నచ్చావులే, ప్రేమకథ వంటి సినిమాలు కూడా మంచి పేరు తెచ్చి పెట్టాయి. ఈ మధ్య కాలంలో రవిబాబు తీసిన ఆవిరి సినిమా కూడా విడుదలైంది. అయితే అది ఆశించనంత విజయం అందుకోలేకపోయింది. అయితే రవిబాబు హర్రర్ సస్పెన్స్ సినిమాలు డైరెక్ట్ చేయడంలో సక్సెస్ అయ్యారని మాత్రం టాలీవుడ్ టాక్.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3f0wuFn

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....