Saturday, 20 June 2020

రానా- మిహిక ఒక్కటయ్యేది అక్కడే..! పెళ్లి వేదిక ఖరారు చేసిన సురేష్ బాబు

టాలీవుడ్ యంగ్ హీరో ఇటీవలే తన పెళ్లి విషయాన్ని చెప్పి సర్‌ప్రైజ్ చేసిన సంగతి తెలిసిందే. త‌న ప్రేమ‌కి గ్రీన్ సిగ్న‌ల్ లభించిందని పేర్కొంటూ ప్రేయసి మిహికా బజాజ్‌ని ప్రేక్షకులకు పరిచయం చేశారు దగ్గుబాటి రానా. దీంతో రానా- మిహికా ఫొటోలతో సోషల్ మీడియా హోరెత్తిపోయింది. ఈ క్రమంలోనే తాజాగా వీరిద్దరి మ్యారేజ్‌కి సంబంధించిన ఓ విషయం బయటకొచ్చింది. మిహికా బజాజ్‌ని పరిచయం చేసిన వెంటనే రానా తండ్రి, ప్రముఖ నిర్మాత సురేష్ బాబు స్పందిస్తూ.. ఈ ఏడాదే ఉంటుందని ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఆగస్టు 18న వీళ్ళ పెళ్లి ముహూర్తం కన్ఫర్మ్ చేసినట్లు సమాచారం. అయితే ఈ పెళ్లిని చాలా గ్రాండ్‌గా చేయాలని ఫిక్స్ అయిన సురేష్ బాబు.. ఫలక్‌నామాను వేదికగా ఎంచుకున్నారని తెలుస్తోంది. కాకపోతే కేవలం కుటుంబ స‌భ్యులు, స్నేహితుల స‌మ‌క్షంలో రానా- మిహీకా బ‌జాజ్‌లు ఏడ‌డుగులు వేయనున్నారట. Also Read: ఇటీవ‌లే రామానాయుడు స్టూడియోలో రానా- మిహీకాల రోకా వేడుక ఘనంగా జరిపించారు. ఈ వేడుకకు రానా, మిహికా కుటుంబ సభ్యులంతా హాజరయ్యారు. అక్కినేని నాగ‌చైత‌న్య‌, స‌మంతలు‌ ఈ రోకా వేడుకలో స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు. ఇందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేశాయి. ఇకపోతే విలక్షణ పాత్రలు ఎంచుకుంటూ వరుస సినిమాలు చేస్తున్న రానా.. ప్రస్తుతం 'అరణ్య' మూవీ చేస్తున్నారు. జంతువుల నేపథ్యంలో రూపొందిన ఈ మూవీకి ప్రభు సోల్మన్ దర్శకత్వం వహించారు. అడవుల్లో సంచరించే ఓ ఆదివాసీ యువకుడిగా, ఏనుగుల కేర్ టేకర్‌గా ఈ మూవీలో రానా విలక్షణ పాత్ర పోషించారు. మరి కొద్దిరోజుల్లో ఈ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/31cYFxh

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....