Thursday, 24 October 2019

షర్టే ప్యాంటు.. పూజా హెగ్డే డ్రెస్ భలే ఉందే.. అంతా ప్రచారం కోసమే!

ఫ్యాషన్‌కు అవధులంటూ ఏమీ ఉండవు. కొత్తగా ఏదొచ్చినా అది ఫ్యాషనే. ముఖ్యంగా సినిమా సెలబ్రిటీలు కొత్తగా ఏదీ ఫాలో అయితే అది ఫ్యాషన్. నిజం చెప్పాలంటే అదే వాళ్ల ప్రత్యేకత. కొంత మంది తారలు వాళ్లు ధరించే దుస్తులతోనే అందరినీ ఆకర్షిస్తారు.. వార్తల్లో నిలుస్తారు. తెలుగులో ఇలాంటి తారల్లో విజయ్ దేవరకొండ ముందు వరుసలో ఉంటారు. ఎందుకంటే ఆయన కాస్ట్యూమ్స్ అంత కొత్తగా.. ఆకర్షణీయంగా ఉంటాయి కాబట్టి. బాలీవుడ్‌లో అయితే చాలా మందే ఉన్నారు. ముఖ్యంగా హీరోయిన్లు వేసుకునే దుస్తులు చాలా కొత్తగా.. సెక్సీగా ఉంటాయి. ‘హౌస్‌ఫుల్ 4’ సినిమాతో బాలీవుడ్‌లో పాగా వేయడానికి ప్రయత్నిస్తోన్న కూడా తన డ్రెస్సింగ్ స్టైల్‌ను పూర్తిగా మార్చేసింది. తన చిత్ర ప్రమోషన్స్‌తో పాటు తనకు కూడా మంచి గుర్తింపు వచ్చే విధంగా డ్రెస్సింగ్‌తోనే అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ప్రమోషన్స్‌తో బాగా బిజీగా ఉన్న పూజా హెగ్డే కొత్తగా డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్‌ను ధరించి కనిపిస్తోంది. ఈ సందర్భంగా తీసుకున్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తుంది. వాటికి అద్భుతమైన స్పందన వస్తోంది. తాజాగా పూజా ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫొటోలు పోస్ట్ చేసింది. ఈ ఫొటోల్లో వైట్ కలర్ డ్రెస్‌లో పూజా కనిపించింది. ఈ డ్రెస్‌కు ఒక ప్రత్యేకత ఉంది. ఇదొక వైట్ షర్ట్. కింద ఇంకేమీ లేదు. షర్టే.. ప్యాంటు. కాకపోతే నడుం దగ్గర ఒక ముడి వేశారు. దీంతో ఆ షర్ట్‌కు కొత్త లుక్ వచ్చింది. అంతేకాదు.. ఈ డ్రెస్‌లో పూజా చాలా హాట్‌గా కనిపిస్తోంది. వైట్ షర్ట్ కన్నా సెక్సీగా ఇంకేమీ ఉండదని స్వయంగా పూజానే చెప్తోంది. ఇదొక్కటే కాదు.. ‘హౌస్‌ఫుల్ 4’ ప్రమోషన్లు ప్రారంభమైనప్పటి నుంచీ పూజా ఇదే ఫార్ములాను ఫాలో అవుతోంది. అందాలను ప్రదర్శించే దుస్తులు తప్ప వేరే ధరించట్లేదు. మరి బాలీవుడ్ దర్శక నిర్మాతలను ఆకర్షించాలంటే ఈ మాత్రం ఆరబోత తప్పదు మరి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/31J8QGl

No comments:

Post a Comment

'I Studied Medicine Only For Papa'

'Thanks to Chhaava's success, I now have the creative freedom to pick and choose.' from rediff Top Interviews https://ift.tt/J...