Sunday, 6 October 2019

యాక్సిడెంట్ అయింది నా కారుకి కాదు: బిగ్‌బాస్ భామ యషికా క్లారిటీ

ప్రముఖ తమిళ నటి, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ యాక్సిడెంట్ వార్తలపై స్పందించారు. శనివారం అర్థరాత్రి యషికా ఆనంద్ తన స్నేహితులతో కలిసి కారులో లాంగ్ ట్రిప్‌కు వెళ్లారు. ఆ సమయంలో వారు ప్రయాణిస్తున్న కారు నుంగబాక్కమ్ ప్రాంతంలో యాక్సిడెంట్‌కు గురైంది. ఈ ప్రమాదంలో భరత్ అనే స్విగ్గీ డెలివరీ బాయ్‌కు తీవ్ర గాయాలయ్యాయట. ప్రస్తుతం అతను హాస్పటిల్‌లో చికిత్స పొందుతూ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడని వార్తలు వస్తున్నాయి. అయితే కారు ప్రమాదం జరిగిన సమయంలో యషికా ఫుల్‌గా తాగి ఉన్నారని వార్తలు వచ్చాయి. పైగా యాక్సిడెంట్ జరిగాక ఎక్కడ పోలీసులు పట్టుకుంటారోనన్న భయంతో అక్కడి నుంచి పారిపోయారని వదంతులు వినిపిస్తున్నాయి. దీనిపై తాజాగా యషికా తమిళ మీడియా వర్గాల ద్వాారా స్పందించారు. ప్రమాదానికి గురైంది తన కారు కాదని తన ఫ్రెండ్ కారని తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో తాను వేరే కారులో ఉన్నానని పేర్కొన్నారు. యాక్సిడెంట్ అయ్యాక పారిపోయానని వచ్చిన వార్తల్లో నిజం లేదని, ఏం జరిగిందో చూసేందుకు కారు దిగానని పేర్కొన్నారు. తన వద్ద హోండా సిటీ కారు తప్ప మరో వాహనం లేదని ఇన్‌స్టాగ్రామ్‌లో తన కారు ఫొటోను పోస్ట్ చేశారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌ను కారులో ఉన్న తన ఫ్రెండ్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని వెల్లడించారు. తాగి కారు నడిపానంటూ తనపై తప్పుడు వార్తలు రాసిన మీడియా వర్గాలపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. తాను ఓ సెలబ్రిటీని కావడంతో పాపులారిటీ కోసం తన పేరును వాడుకుంటున్నారని మండిపడ్డారు. పాదం, కవలై వెండమ్, మణియార్ కుదుబం, జాంబీ, నోటా వంటి సినిమాలతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు యషికా. ప్రముఖ సెలబ్రిటీ రియాల్టీ షో బిగ్‌బాస్ సీజన్ 2లో కంటెస్టెంట్‌గా పాల్గొన్నారు. ప్రస్తుతం జరుగుతున్న బిగ్‌బాస్ సీజన్ 3కు ఇటీవల గెస్ట్‌గా హాజరయ్యారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2LVzyHb

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....