Wednesday 2 October 2019

బాలయ్యతో బోయపాటి ప్రయోగం.. సరికొత్త లుక్‌లో!

నందమూరి బాలకృష్ణ రాజకీయాలతో పాటు సినిమాలను కూడా బ్యాలెన్స్‌ చేస్తూ దూసుకుపోతున్నాడు. ఎన్టీఆర్‌ బయోపిక్‌లు డిజాస్టర్‌ కావటంతో కాస్త స్లో అయిన బాలయ్య తిరిగి స్పీడు పెంచాడు. ఇప్పటికే తమిళ దర్శకుడు కేఎస్ రవికుమార్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. బాలకృష్ణను డిఫరెంట్‌ లుక్‌లో చూపిస్తున్న ఈ సినిమాకు రూలర్‌ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమా సెట్స్‌ మీద ఉండగానే మరో సినిమాను లైన్‌లో పెట్టాడు నందమూరి బాలకృష్ణ. తన కెరీర్‌ బిగ్గెస్ట్ హిట్స్‌గా నిలిచిన సింహా, లెజెండ్‌ సినిమాలను అందించిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుక ఓకె చెప్పాడు. ఈ సినిమాలో బాలయ్యను సరికొత్త అవతారంలో చూపించబోతున్నాడట బోయపాటి. ఇప్పటికే రూలర్‌ కోసం 15 కేజీల వరకు బరువు తగ్గిన బాలకృష్ణ, బోయపాటి సినిమా కోసం మరో 10 కేజీలు తగ్గేందుకు కసరత్తులు కూడా ప్రారంభించాడట. Also Read: ఈలోగా రూలర్‌ షూటింగ్‌ను పూర్తి చేసి నవంబర్‌లో బోయపాటి సినిమా పనులు ప్రారంభించే ఆలోచనలో ఉన్నారు. నవంబర్‌లో లుక్‌ టెస్ట్ చేసి డిసెంబర్‌ నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ స్టార్ట్ చేసే ప్లాన్‌లో ఉన్నారు. బోయపాటి గత చిత్రం వినయ విధేయ రామ డిజాస్టర్‌ కావటంతో ఆయన కెరీర్‌కు కూడా బాలకృష్ణ సినిమా కీలకం కానుంది. ఈ సినిమాతో హిట్ కొట్టి మరోసారి తన స్టామినాను ప్రూవ్‌ చేసుకోవాలని భావిస్తున్నాడు ఈ మాస్ డైరెక్టర్‌. మిర్యాల రవీందర్‌ రెడ్డి నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను 2020 వేసవికి విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. కేయస్‌ రవికుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలోనూ బాలయ్య రెండు డిఫరెంట్ లుక్స్‌లో అలరించనున్నాడు. గతంలో జై సింహాతో నిరాశపరిచిన బాలయ్య, రవికుమార్‌లు ఈ సారి ఎలాగైన సక్సెస్‌ కొట్టాలని భావిస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య సరసన సోనాల్‌ చౌహాన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2oIXzYA

No comments:

Post a Comment

Exclusive! The IPL Chairman Reveals All

'Whichever teams have the best players they get a chance to retain them.<br>'There is a lot of scope for new players to come i...