Thursday 9 September 2021

Seetimaarr Twitter Review: గోపీచంద్ లేటెస్ట్ స్పోర్ట్స్ డ్రామా సీటీమార్ ట్విట్టర్ రివ్యూ.. మాస్‌కు కేరాఫ్ అడ్రస్!

గోపీచంద్, కాంబినేషన్‌లో అనే స్పోర్ట్స్ డ్రామా తెరకెక్కిన సంగతి తెలిసిందే. మాస్‌ డైరెక్టర్‌ సంపత్‌ నంది కబడ్డి నేపథ్యంలో తెరకెక్కించిన ఈ చిత్రం నేడు (సెప్టెంబర్ 10)న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్లో భారీ ఎత్తున విడుదలైన ఈ మూవీపై సోషల్ మీడియాలో టాక్ మొదలైంది. చాలా రోజుల తరువాత సరైన మాస్ చిత్రం రాబోతోందంటూ ప్రేక్షకులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొత్తానికి కొన్ని చోట్ల షోలు మొదలయ్యాయి. ఓవర్సీస్‌లో షోలు పడటంతో నెట్టింట్లో సీటీమార్ రచ్చ నడుస్తోంది. గోపీచంద్‌కు హిట్ రావాలి.. ఈ మాస్ మసాలా యాక్షన్ ఎంటర్టైన్మెంట్ హిట్ కావాలంటూ నెటిజన్లు ట్వీట్లు పెడుతున్నారు. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా పలుమార్లు వాయిదా పడుతూనే వచ్చింది. కరోనా కరాణంగా ఆలస్యమైనా కూడా ఎట్టకేలకు నేడు థియేటర్లోకి వచ్చింది. పాటలు, టీజర్, ట్రైలర్‌లతో ఇప్పటికే సీటీమార్ మీద అంచనాలు పెంచేశారు. మాస్ అంశాలతో పాటే ఎమోషనల్ కంటెంట్ కూడా ఉందని కామెంట్లు చేస్తున్నారు. కబడ్డి నేపథ్యంలో ఇది వరకే ఎన్నో చిత్రాలు వచ్చాయి. అసలే ఇప్పుడు ప్రో కబడ్డి సీజన్ హవా ఉంది. అలా కబడ్డి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సీటీమార్ ప్రస్తుతం నెట్టింట్లో హాట్ టాపిక్ అవుతోంది. ఇక నెటిజన్లు సీటీమార్ షో చూస్తూ.. థియేటర్లోంచే అప్డేట్లు ఇస్తున్నారు. షో పడింది.. ఇట్సే షో టైం అంటూ నానా హంగామా చేస్తున్నారు. మొత్తానికి తెలుగు ప్రేక్షకులను వినాయక చవితి పండుగ సందర్భంగా అదిరిపోయే మాస్ ఎంటర్టైనర్ వచ్చిందని కామెంట్లు పెడుతున్నారు. ఇంకాసేపట్లో పూర్తి రివ్యూ రాబోతోంది. ఈ సినిమాలో ఆంధ్ర ఫీమేల్ కబడ్డీ టీమ్ కోచ్‌గా , తెలంగాణ ఫీమేల్ కబడ్డీ టీమ్ కోచ్‌గా తమన్నా నటించిన సంగతి తెలిసిందే.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3ttLGTK

No comments:

Post a Comment

THE MUST READ REKHA INTERVIEW!

'At one time, I felt being a mother was the ultimate experience, a woman was not complete without it.' from rediff Top Interviews ...