Monday 6 September 2021

Republic Song: మణిశర్మ బీట్.. జోర్ సే అంటూ ఫుల్ జోష్‌లో మెగా మేనల్లుడు

మెగా మేనల్లుడు హీరోగా రాబోతున్న కొత్త సినిమా ''. పొలిటికల్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్ ఎంచుకొని రూపొందిస్తున్న ఈ సినిమాకు భగవాన్, జె.పుల్లారావు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఈ సినిమా నుంచి ''జోర్ సే'' సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో సాయి ధరమ్ తేజ్ వేస్తున్న హుషారైన స్టెప్స్ స్పెషల్ అట్రాక్షన్ అయ్యాయి. జోర్ సే అంటూ సాగిపోతున్న ఈ లిరికల్ సాంగ్‌కి సుద్దాల అశోక్ తేజ లిరిక్స్ రాయగా.. అనురాగ్ కులకర్ణి, సాకీ శ్రీనివాస్, బరిమిశెట్టి ఆలపించారు. మణిశర్మ బాణీలు కట్టారు. ఫుల్ జోష్‌లో కనిపించిన మెగా మేనల్లుడు.. ఈ సాంగ్ తనకెంతో స్పెషల్ అంటూ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. చాలా రోజుల తర్వాత ఈ పాటలో హార్ట్‌ఫుల్ డాన్స్ చేశానని, ఇది మీ అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉందని అన్నారు. జేబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, జీ స్టూడియోస్‌ పతాకాలపై భారీ రేంజ్‌లో నిర్మిస్తున్న ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. సీఎం పాత్రలో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ కనిపించనుండటం విశేషం. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. చాలా రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ.. కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 1న ఈ మూవీ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3kXPBnZ

No comments:

Post a Comment

'I'd Love To Romance Rekha Ma'am'

'Romance not in a physical manner maybe, but, you know, where you are just sharing dialogues and looking at each other and conversations...