Sunday 5 September 2021

Prakash Raj : ఆరంభమే ఎదురుదెబ్బ.. ప్రకాష్‌ రాజ్‌కు పరాభవం.. పోటీకి దిగిన బండ్ల గణేష్

మా ఎన్నికల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతుందనడానికి తాజాగా ఓ ఉదాహరణ దొరికింది. మొన్నటికి మొన్న తన సభ్యులందరి మాట్లాడి, అందరూ కలిసి ఓ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. అందులో భాగంగానే తన ప్యానెల్‌ను ప్రకటిస్తున్నామని, ఇది అందరి నిర్ణయమని ప్రకాష్ రాజ్ ఎంతో గొప్పగా చెప్పుకొచ్చారు. కానీ తాజాగా ప్రకాష్ రాజ్‌వి ఉత్త గాలి మాటలే అని తేలింది. తనకు ఇచ్చిన అధికార ప్రతినిధి (స్పోక్స్ పర్సన్) కేటగిరీపై హర్ట్ అయినట్టున్నారు. తాజాగా బండ్ల గణేష్ చేసిన వరుస ట్వీట్లు ప్రకాష్ రాజ్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్టు అయింది. ప్రకాష్ రాజ్‌కు ఎంతో గౌరవంగా చెబుతూ.. తనకు అధికార ప్రతినిధి పదవి వద్దని తిరస్కరించేశాడు. నా పర్సనల్ కారణాలు, పనుల వల్ల ఆ పదవిని నేను స్వీకరించలేను.. వేరే ఎవరినైనా ఈ పదవి కోసం చూసుకోండి అని చెప్పుకొచ్చారు. ఆ వెంటనే అసలు షాక్ ఇచ్చారు బండ్ల గణేష్. ‘మాట తప్పను .. మడమ తిప్పను నాది ఒకటే మాట -ఒకటే బాట నమ్మడం -నమ్మినవారికోసం బతకడం. నా మనస్సాక్షి చెప్పినట్టు నడుచుకుంటాను - నేను ఎవరిమాట వినను త్వరలో జరిగే మా ఎన్నికల్లో జనరల్ సెక్రెటరీ గా పోటీ చేస్తాను - పోటీ చేసి ఘన విజయం సాధిస్తాను మనస్సాక్షికి ఎంతచెప్పినా మాట వినడం లేదు-నన్ను పోటీ చెయ్ అంటోంది -అందుకే ఈ పోటీ అందరికీ అవకాశం ఇచ్చారు ఒకేఒక అవకాశం నాకివ్వండి నేనేంటో చూపిస్తా .. నా పరిపాలన ఎంటో తెలియచేస్త వంద మంది పేద కళాకారులకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వడం నా ధ్యేయం దానికోసం పోరాడతా.. వారి సొంత ఇంటి కల నిజం చేస్తా ఇప్పుడు పదవుల్లో ఉన్నవాళ్లు రెండేళ్లుగా ఏమి చేయలేదు.. ఇప్పుడు చేస్తామంటే మా సభ్యులు నమ్మరు గొడవలతో మా సభ్యులను మోసం చేసింది చాలు.. ఇక అలా జరగొద్దు అందరి ఆశీస్సులు కావాలి -మా ను బలో పేతం చేద్దాం ముఖ్యంగా పేద కళాకారులకు ఇళ్ళ కల నిజం చేద్దాం అదే మా నిజమైన అభివృద్ది... చిహ్నం - ఇట్లు మీ బండ్ల గణేష్’ అని వరుస ట్వీట్లు వేశారు. అయితే జనరల్ సెక్రటరీగా ఆల్రెడీ జీవిత రాజశేఖర్‌ను ప్రకాష్ రాజ్ బలోపేతం చేశారు. మరి బండ్లన్న కోసం నిర్ణయం మార్చుకుంటారా? లేకు సింగిల్‌గానే బండ్లన్న బరిలోకి దిగుతాడా? అన్నది చూడాలి. మొత్తానికి ప్రకాష్ రాజ్ ప్యానల్‌లో ఆరంభంలోనే చీలికలు ఏర్పడ్డట్టు అయింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3n5dX1W

No comments:

Post a Comment

How To Be Aware About Early Heart Disease

'Thirty per cent of the world's deaths in young people, due to heart disease, are encountered by people in India.' from rediff...