బర్త్ డే కానుకగా విడుదల చేసిన 'భీమ్లా నాయక్' సాంగ్ ఓ రేంజ్‌లో దూసుకుపోతోంది. సోషల్ మీడియాలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ యూట్యూబ్ టాప్ 1లో ట్రెండ్ అవుతోంది. ఇందులో తమన్ అందించిన బాణీలు పీక్స్‌లో ఉన్నాయనేది కొందరి అభిప్రాయం కాగా.. ఈ పాట ఆశించిన రేంజ్‌లో లేదనేది మరికొందరి వాదన. ఈ పరిస్థితుల నడుమ పాటపై తెలంగాణ పోలీసుల నుంచి అభ్యంతరం వ్యక్తమవుతుండటం హాట్ టాపిక్ అయింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా హీరోలుగా 'అయ్యప్పనుమ్ కోషియుమ్' తెలుగు రీమేక్‌గా 'భీమ్లా నాయక్' సినిమా రూపొందిస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లేలో భారీ బడ్జెట్ కేటాయించి రూపొందిస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. పవన్ పుట్టినరోజు కానుకగా 'భీమ్లా నాయక్' టైటిల్ సాంగ్ రిలీజ్ చేసి పవర్ స్టార్ అభిమానులకు కిక్కిచ్చారు దర్శకనిర్మాతలు. హీరోయిజాన్ని ఎలివేట్ చేసేలా సాగిపోతున్న ఈ పాటలో ''ఇరగదీసే ఫైర్ సల్లగుండ.. నిమ్మళంగా కనబడే నిప్పుకొండ.. దంచి దడదడలాడించే సేవక్.. ఖాకీ డ్రెస్సు పక్కనెడితే వీడే పెద్దగూండా.. నిమ్మళంగ కనబడే నిప్పుకొండ.. ముట్టుకుంటే తాట లేసిపోద్ది తప్పకుండా..'' అంటూ రామజోగయ్య శాస్త్రి అందించిన లిరిక్స్ పవన్ అభిమానులకు ఊపు తెప్పించాయి. పవన్ కళ్యాణ్ ఇమేజ్ దృష్టిలో పెట్టుకొని ఈ సాంగ్ ఇలా పవర్‌ఫుల్‌గా పిక్చరైజ్ చేసి రిలీజ్ చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఈ సాంగ్ చూసి తెలంగాణ సీనియర్ IPS ఆఫీసర్, హైదరాబాద్ ఈస్ట్ జోన్ డీసీపీ రమేశ్ 'భీమ్లా నాయక్' పాటలోని లిరిక్స్‌పై అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణా కాప్స్ అంటే ఫ్రెండ్లీ పోలీసులు. మేము రక్షించే వాళ్ళమే కానీ ఎముకలు విరగొట్టే వాళ్ళం కాదు. గేయ రచయిత రామజోగయ్య శాస్త్రికి పోలీసుల ఛరిష్మాను వర్ణించేందుకు ఇంతకుమించిన పదాలు దొరక్కపోవడం ఆశ్చర్యకరంగా ఉందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఇష్యూ వైరల్ అయింది. దీనిపై నెటిజన్ల నుంచి భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3yNaEPe
No comments:
Post a Comment