Tuesday, 21 September 2021

HBD Krithi Shetty: ‘ఉప్పెన’ బ్యూటీ బర్త్ డే స్పెషల్.. వరుసగా ఆమె సినిమా అప్‌డేట్స్

‘నీ కళ్లు నీలి సముద్రం’ అనే మాటకు నిదర్శనంగా కనిపించే అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది యంగ్ బ్యూటీ కృతి శెట్టి. తొలి సినిమా ‘ఉప్పెన’తో ఎంతో క్రేజ్ సంపాదించుకుంది ఈ భామ. బచ్చిబాబు దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతూ.. తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను అలరించడమే కాదు.. కలెక్షన్ల పరంగా కూడా నిర్మాతలు మంచి రాబడిని ఇచ్చింది. ఇక ఈ సినిమాలో తన నటనతో ఫిదా చేసిన కృతి శెట్టికి ఆఫర్లు క్యూ కడుతున్నాయి. మంగళవారం పుట్టిన రోజు దీంతో ఆమె ప్రస్తుతం నటిస్తున్న సినిమాల నుంచి వరుసగా అప్‌డేట్స్ వచ్చాయి. అందులో ప్రధానంగా చెప్పుకొనే సినిమా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో రూపొందుతున్న . న్యాచురల్ స్టార్ నాని ఇందులో హీరో.. కృతి శెట్టి పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ ఆమెకు విషెస్ చెబుతూ ఓ చిన్న వీడియయోని విడుదల చేశారు. కృతితో పాటు ఈ సినిమాలో సాయి పల్లవి, మడోనా సెబాస్టియన్లు కూడా హీరోయిన్లుగా చేస్తున్నారు. ఇక కృతి నటిస్తున్న మరో చిత్రం ‘’. ఈ సినిమాలో సుధీర్‌బాబు హీరోగా నటిస్తున్నారు. మోహనకృష్ణ ఇంద్రగంటి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర యూనిట్ కూడా ఓ పోస్టర్‌తో కృతికి విషెస్ చెప్పింది. ఇకపోతే టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని.. తమిళ దర్శకుడు లింగుస్వామి కాంబినేషన్‌లో ‘’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాలోనూ కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక కృతి శెట్టి పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా యూనిట్‌ కూడా ఓ ప్రత్యేకమైన పోస్టర్ విడుదల చేసి ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. దీంతో పాటు ఆమెతో నటిస్తున్న నటీనటులు, టెక్నీషన్లు కూడా ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పి.. ఆమె భవిష్యత్తులో ఎంతో ఆరోగ్యంగా ఉంటూ.. మరిన్ని మంచి సినిమాలు చేయాలని ఆకాంక్షించారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2XwBRZl

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....