Sunday 19 September 2021

Chiranjeevi: ఇండస్ట్రీ అంటే ఓ నలుగురైదుగురు హీరోలు కాదు.. చిరంజీవి ఎమోషనల్ కామెంట్స్

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన సినిమా ''. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమాను నారాయణ దాస్‌ కె.నారంగ్‌, పుస్కూర్‌ రామ్మోహన్‌రావు సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న (ఆదివారం) రాత్రి హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు బాలీవుడ్ స్టార్ హీరో ఆమీర్ ఖాన్‌తో టాలీవుడ్ రారాజు, మెగాస్టార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వేదికపై మాట్లాడిన చిరంజీవి.. 'లవ్ స్టోరీ' యూనిట్‌ మొత్తానికి పేరు పేరునా ఆల్ ది బెస్ట్ చెబుతూ ఇండస్ట్రీలో ఉన్న సంక్షోభం గురించి ఓపెన్ అయ్యారు. ''కొన్ని దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమ సక్సెస్‌ రేట్‌ మహా అయితే 20 శాతం మాత్రమే ఉంది. ఈ మాత్రం దానికే ఇండస్ట్రీ పచ్చగా ఇండస్ట్రీ ఉంటుందని అనుకుంటుంటారు. కానీ, ఇక్కడ కష్టాలు పడేవారు చాలామంది ఉన్నారు. రెక్కాడితే గాని డొక్కాడని కార్మికులు ఉన్నారు. ప్రత్యక్షంగా వేల మంది, పరోక్షంగా లక్షల మంది ఇండస్ట్రీ కోసం పని చేస్తున్నారు. ఇలా వాళ్లంతా కలిస్తేనే ఇండస్ట్రీ తప్ప ఓ నలుగురైదుగురు హీరోలు, నిర్మాతలు, డైరెక్టర్లు కలిస్తే కాదు. కొందరు బాగున్నంత మాత్రాన పరిశ్రమ మొత్తం పచ్చగా ఉన్నట్లు కాదు. కరోనా సమయంలో షూటింగ్స్‌ లేక ఆర్ధిక ఇబ్బందులతో బిక్కుబిక్కుమన్న రోజువారీ కార్మికులు వేలాది మంది ఉన్నారు. ఒక్కసారిగా షూటింగ్స్ ఆగిపోయే సరికి కార్మికులు ఎంత ఇబ్బంది పడ్డారన్నది కళ్లారా చూశాం. మాకు తోచినట్లుగా సినీ హీరోలు, ఇతర పెద్దల్ని అడిగి వాళ్లకు నిత్యావసరాలు అందించి ఎంతో కొంత సాయపడ్డాం. ఏ విపత్తు వచ్చినా సాయం చేయడంలో ముందుండేది మా సినిమా ఇండస్ట్రీనే అని గర్వంగా చెప్పగలను. అలాంటి ఇండస్ట్రీ ఈ రోజున సంక్షోభంలో కూరుకుపోయింది. సినిమా నిర్మాణం వ్యయం పెరిగిపోయింది. ఈ వేదికగా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలను మా విన్నపం పట్ల సానుకూలంగా స్పందించి నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా'' అని చిరంజీవి అన్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3Exd7RQ

No comments:

Post a Comment

'Nifty Pullback Needs To Be Taken In Stride'

'The biggest near-term risk to Indian equities is the outflow of investments to China as tactical trades by foreign investors.' fr...