Thursday, 23 September 2021

లండన్‌కి వెళ్లిన సిద్ధార్త్.. కారణం అదేనట.. అసలు విషయం తెలిస్తే షాక్ అవుతారు..!

‘బాయ్స్’ చిత్రంతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నటుడు ఆ తర్వాత ‘బొమ్మరిల్లు’ ‘నువ్వొస్తానంటే.. నేనొద్దంటానా’ మొదలగు సినిమాలతో లవర్ బాయ్‌గా పేరు తెచ్చుకున్నారు. అయితే ఆ తర్వాత వచ్చిన సిద్ధార్త్ సినిమాలేవీ పెద్దగా ఆడలేదు. చాలాకాలంగా అతను సరైన హిట్‌ లేకుండా ఉన్నాడు. దీంతో ప్రయోగాత్మక చిత్రాలు చేస్తూ సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు మళ్లీ సిద్ధార్త్ రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. ‘ఆర్ఎక్స్100’ ఫేమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘’ సినిమాతో ఆయన త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అయితే ఇటీవల ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ జరిగింది. కానీ, ఈ ఈవెంట్‌కు మాత్రం సిద్ధార్త్ హాజరు కాలేదు. దీంతో ఆయన ఎందుకు రాలేదా..? అంటూ అనుమానాలు పుట్టుకొచ్చాయి. అయితే అసలు కారణాన్ని దర్శకుడు అజయ్ భూపతి వెల్లడించారు. సిద్ధార్త్ ఆపరేషన్ కోసం లండన్ వెళ్లారు అని.. అందుకే ఈ ఈవెంట్‌కు ఆయన హాజరుకాలేకపోయారు అని అజయ్ తెలిపారు. అయితే అది దేనికి సంబంధించిన ఆపరేషన్ అనే విషయాన్ని మాత్రం ఆయన బయటపెట్టలేదు. అయితే సోషల్‌మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ తరచూ తన విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకొని సిద్ధార్త్ ఈ విషయాన్ని ఎందుకు పంచుకోలేదా అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. మొత్తానికి ఆయనకు జరిగే అపరేషన్ ఏదైనా సరే విజయవంతం కావాలని మళ్లీ ఆయన ఆరోగ్యంగా తిరిగి రావాలని వాళ్లు కోరుకుంటున్నారు. ఇక ‘మహా సముద్రం’ సినిమా విషయానికొస్తే.. ఈ సినిమాలో కూడా హీరోగా నటిస్తుండగా.. అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యూయేల్ హీరోయిన్లుగా చేస్తున్నారు. జగపతి బాబు, రావు రమేశ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రీసెంట్‌గా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ సినిమాపై అంచనాలను ఓ రేంజ్‌లో పెంచేసింది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాకు చేతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా దసరా కానుకగా.. అక్టోబర్ 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/39zzR5q

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....