Wednesday 8 September 2021

అనుకున్న టైమ్ కంటే ముందుగానే.. ‘టాక్ జగదీష్’ నుంచి మరో ఆసక్తికర అప్డేట్

ఇండస్ట్రీలోకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా అడుగుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారిపోయారు నాచురల్ స్టార్ నాని. సహజమైన నటనతో ఆయన ప్రేక్షకులకు ఎంతో చేరువ అయ్యారు. చూడటానికి మన పక్కింటి కుర్రాడి ఉండే నటన చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. కామెడి అయినా, సెంటిమెంట్ అయినా.. ఆయన అద్భుతంగా పండించగలరు. ‘అష్టచమ్మ’ సినిమాతో హీరోగా పరిచయమైన సినీ ప్రస్థానం.. దిగ్విజయంగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఆయన వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇక ఆయన నటిస్తున్న కుటుంబ కథా చిత్రం ‘టక్ జగదీష్’. మంచి కుటుంబ విలువలు కలిగిన ఈ సినిమా షూటింగ్ పూర్తి అయి చాలాకాలమే అయింది. అయితే కరోనా వైరస్ వ్యాప్తికారణంగా సినిమా విడుదల వాయిదాపడుతూ వస్తుంది. అయితే కొద్దిరోజుల క్రితం ఈ సినిమా నుంచి అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమాలు అధికారికంగా ఓటీటీలో విడుదల చేస్తున్నామని చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే దీనిపై పలు విమర్శలు కూడా వచ్చాయి. పెద్ద హీరోల సినిమాలు థియేటర్లు తెరుచుకున్న తర్వాత కూడా ఓటీటీలో విడుదల కావడాన్ని థియేటర్ల యాజమాన్యలు వ్యతిరేకించాయి. కానీ, ఆ తర్వాత ఈ సినిమా విషయంలో వాళ్లు కాంప్రమైజ్ అయ్యారు. ఈ చిత్రం 10వ తారీఖున అంటే అర్ధ రాత్రి 12 గంటలకే కాకుండా 9న రాత్రి 10 గంటల నుంచే అందుబాటులోకి రానున్నట్టుగా తెలుస్తుంది. ఇక సినిమా విషయానికొస్తే.. హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో జగపతిబాబు నాని ‘అన్న’ పాత్రలో నటిస్తున్నారు. తమిళ నటి ఐశ్వర్య రాజేష్ ఈ సినిమాలో నాని సోదరి పాత్రలో నటించనుంది. మరి వినాయక చవితి కానుకగా వచ్చే ఈ ‘టక్ జగదీష్’ ప్రేక్షకులకు ఎలా అలరిస్తాడో వేచి చూడాల్సిందే.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2YDn2EX

No comments:

Post a Comment

'We Attribute Failure To The Director'

'Our analysis of success, like failure, is so reductive and so one dimensional that we don't look at the bigger picture.' from...