Sunday 5 September 2021

నాకు ఇక్కడి రాజకీయాల గురించి తెలియదు! ఆయన చెప్పారు కానీ నమ్మలేదు.. రాజమౌళి తండ్రిపై కంగనా కామెంట్స్

సినీ నటి, దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘’. బాలీవుడ్ క్వీన్ , జయలలిత పాత్ర పోషిస్తుండగా.. విలక్షణ నటుడు అరవింద్ స్వామి ఎంజీఆర్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు. ఏఎల్ విజయ్ డైరెక్ట్ చేస్తున్నారు. విబ్రి మీడియా, కర్మ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాను తమిళ, తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. విశాల్ విఠల్ కెమెరామెన్‌గా పని చేస్తున్నారు. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా హైద‌రాబాద్‌లో జ‌రిగిన తలైవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో కంగనా రనౌత్, అరవింద్ స్వామి, త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మూవీ రైటర్, రాజమౌళి తండ్రి విజ‌యేంద్ర ప్ర‌సాద్‌పై కంగనా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆమె మాట్లాడుతూ.. ''మా ప్రొడ్యూసర్ విష్ణు సార్‌కి ఎప్పటికీ గుర్తుంచుకునే బ్లాక్ బస్టర్ బర్త్ డే గిఫ్ట్ ఈ సినిమానే అవుతుంది. థాంక్యూ వెరీ మ‌చ్‌ సార్. నాకు తమిళం గురించి కానీ, ఇక్కడి రాజకీయాల గురించి కానీ ఏం తెలియదు. నేను ఈ పాత్రను పోషించగలను అని విజయేంద్ర ప్రసాద్ గారు చెప్పినప్పుడు నేను నమ్మలేదు. కానీ ఇప్పుడు మాత్రం నాకే వింతగా అనిపిస్తోంది. కానీ సినిమా చూసినప్పుడు మీరే (విజయేంద్ర ప్రసాద్) రైట్ అనిపించింది'' అన్నారు. విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. ''కంగనాను ఈ సినిమాలో తీసుకోవాలని చెప్పాను. ఆ కథ చెప్పినప్పుడు వారు వేరే హీరోయిన్‌ను అనుకున్నారు. కానీ నా మైండ్‌లోకి కంగనా వచ్చింది. కానీ ఆ విషయాన్ని అడిగేందుకు ఆమెను అప్రోచ్ అయ్యే వారు ఎవరు? ఒకవేళ ఆమెకు కథ నచ్చక పోతే మనల్ని బతకనివ్వదు. ఆమెకు కథ నచ్చింది. నువ్ నీలానే ఉండు.. నీ లానే ప్రవర్తించు అని చెప్పా. అదే జయలలిత అని చెప్పాను. జయలలితగా కంగనా అదరగొట్టేసింది'' అన్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3kYfNis

No comments:

Post a Comment

'Omar Abdullah Is Seen As A Tourist'

'The Abdullah family is the problem and facilitator of the instability that we are seeing in Kashmir.' from rediff Top Interviews ...