Saturday 4 September 2021

సూపర్‌స్టార్ ఫ్యామిలీ నుంచి మరో హీరో.. ఆకట్టుకుంటున్న సినిమా ఫస్ట్ గ్లింప్స్

ప్రతి ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరో ఉంటే అతని ఫ్యామిలీ నుంచి మరికొంత మంది కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడం సాధారణంగా జరిగే విషయమే. అయితే దీన్ని కొందరు ఎలాంటి ఇబ్బంది పడకుండా సమర్థిస్తుండగా.. మరికొందరు మాత్రం తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తారు. దీనికి నెపొటిజం అని పేరు పెట్టి.. ఇలా స్టార్ ఫ్యామిలీల నుంచి నటీనటులు రావడంతో అసలు టాలెంట్ ఉన్న వాళ్లకు అవకాశాలు రావడం లేదు అనేది వాళ్ల వాదన. అయినప్పటికీ.. స్టార్ ఫ్యామిలీల నుంచి కొత్త వాళ్లు పరిచయం అవ్వడం మాత్రం ఎక్కడ ఆగలేదు. ఇక తెలుగు ఇండస్ట్రీ విషయానికొస్తే.. ఎన్టీఆర్, ఎఎన్నార్, కృష్ణ, చిరంజీవి వీళ్ల కుటుంబాల నుంచి ఇప్పటికే చాలామంది హీరోలుగా పరిచయం అయ్యారు. అందులో కొందరు తమ టాలెంట్‌తో నిలదొచ్చుకోగా.. కొందరు మాత్రం ఒకటి, రెండు సినిమాలు చేసి.. మళ్లీ కనిపించలేదు. అలా సూపర్‌స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి ఇప్పటికే మహేష్ బాబు, సీనియర్ నరేష్‌లు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. అయితే మహేష్‌బాబు కంటే ముందే ఎంట్రీ ఇచ్చిన నరేష్ ప్రస్తుతం సైడ్ పాత్రలు చేస్తున్నారు. తాజాగా ఆ ఫ్యామిలీ నుంచి మరో వ్యక్తి హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నారు. అతనే . శివ కేశ‌ర కుర్తి ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ వెన్నెల క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ప్రొడ‌క్ష‌న్ నెం.3గా ఎం.సుధాక‌ర్ రెడ్డి నిర్మిస్తున్న సినిమాతో ఆయన వెండితెరకు పరిచయం కానున్నారు. శ‌నివారం శ‌ర‌ణ్ కుమార్ పుట్టిన‌రోజు సందర్భంగా ఈ సినిమా నుంచి గ్లింప్స్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఇప్పటికే సూపర్‌స్టార్ కృష్ణ ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. తాజాగా శరణ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా చిన్న గ్లింప్స్‌ని వదిలింది చిత్ర యూనిట్. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. ఇక ఈ సినిమా శరణ్‌కు మంచి బ్రేక్ ఇస్తుంది అని ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్‌డేట్స్ త్వరలోనే విడుదల చేస్తామని నిర్మాత సుధాకర్ రెడ్డి అన్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Vh691r

No comments:

Post a Comment

'Mamata Should Have Done Something Else'

'She could have sat down with the students and taken a list of their grievances including their allegations and suspicions.' from ...