Sunday 19 September 2021

అనసూయకు వింత పేరు పెట్టేశాడే?.. వెన్నెల కిషోర్ కామెంట్స్ వైరల్

సోషల్ మీడియాలో ఎంత సరదాగా ఉంటారో అందరికీ తెలిసిందే. తెరపై ఎంత నవ్విస్తుంటాడో.. తెర వెనకాల కూడా అంతే సరదాగా ఉంటూ హాస్యాన్ని పండిస్తుంటాడు. ఇక సోషల్ మీడియాలో అయితే నెటిజన్లు రకరకాలుగా నవ్విస్తుంటాడు. సెలెబ్రిటీల పోస్ట్‌లకు ఫన్నీ రిప్లైలు ఇస్తూ, విభిన్న గెటప్పుల్లో ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ వెన్నెల కిషోర్ నెట్టింట్లో రచ్చ చేస్తుంటాడు. నేడు (సెప్టెంబర్ 19) వెన్నెల కిషోర్ బర్త్ డే. ఈ మేరకు టాలీవుడ్ స్టార్స్ అంతా కూడా వెన్నెల కిషోర్‌కు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఈ క్రమంలో భరద్వాజ్ కూడా విషెస్ తెలిపారు. అయితే పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ.. వెన్నెల కిషోర్ మీదున్న ప్రేమను చాటుకుంది. ప్రతీ ఒక్కరికీ ఎంతో ఫేవరేట్.. మరీ ముఖ్యంగా నాకు ఎంతో ఫేవరేట్ అయిన వెన్నెల కిషోర్‌కు హ్యాపీ బర్త్ డే అని వెన్నెల కిషోర్ ఫోటోను షేర్ చేసింది. హ్యాపీ, హ్యాపియర్, హ్యాపీయెస్ట్ బర్త్ డే, మై ఫేవరేట్ అంటూ అనసూయ చెప్పుకొచ్చింది. ఈ సారి నన్నెవరు ఆపలేరు ఫోటోకి బీబీ అంటూ క్యాప్షన్ పెట్టింది. అనసూయ చెప్పిన విషెస్‌కు వెన్నెల కిషోర్ స్పందించాడు. తిరిగి థ్యాంక్స్ చెబుతూ అసలు గుట్టు విప్పేశాడు. అనసూయకు వింత పేరు పెట్టేశాడు వెన్నెల కిషోర్. అయితే అది అనసూయ ముద్దు పేరా? లేక ఏదైనా భవిష్యత్తు ప్రాజెక్ట్‌లోని కారెక్టర్ పేరా? అనేది తెలియాల్సి ఉంది. అనసూయ చెప్పిన బర్త్ డే విషెస్‌కు ప్రతిస్పందనగా.. థాంక్యూ బెల్లా అని వెన్నెల కిషోర్ పోస్ట్ చేశాడు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3kmX40X

No comments:

Post a Comment

'I Don't Do Intimate Scenes'

'There are some things I may not be comfortable about. Explicit things and all that.' from rediff Top Interviews https://ift.tt/ge...