Monday 6 September 2021

పెళ్లిపై నోరువిప్పిన రాశీఖన్నా.. కాబోయే వాడు అలా ఉండాలంటూ ఓపెన్ కామెంట్స్

ఈ మధ్యకాలంలో సినీ తరాల పెళ్లి విషయాలు నిత్యం చర్చల్లో నిలుస్తున్నాయి. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ అయిన సెలబ్రిటీలంతా ఒక్కొక్కరుగా పెళ్లి పీటలెక్కుతుండటంతో ఆ లిస్టులో ఉన్న అందరిపై దృష్టి పెట్టారు ఆడియన్స్. ఈ నేపథ్యంలోనే తాజాగా అందాల తార తన పెళ్లి విషయమై రియాక్ట్ అయింది. తనకు కాబోయే వరుడు ఎలా ఉండాలో చెబుతూ ఓపెన్ కామెంట్స్ చేసింది. ఒకప్పుడు బొద్దుగుమ్మలా ఉన్న రాశీ ఖన్నా.. ఇప్పుడు నాజూగ్గా మారిపోయి పలు తెలుగు, తమిళ సినిమాలతో బిజీ హీరోయిన్ అయింది. ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా మేకోవర్ అవుతూ వరుస అవకాశాలు పట్టేస్తున్న ఈ బ్యూటీ.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఇందులో భాగంగానే తనకు ఎలాంటి భర్త కావాలో చెప్పేసింది. ఆమె చెప్పిన మాటలు చూస్తే పెళ్లి విషయంలో అందరు హీరోయిన్లకు భిన్నంగా రాశీ ఆలోచనలు ఉన్నాయని స్పష్టమవుతోంది. తనకు కాబోయే భర్త పెద్ద అందగాడు కాకపోయినా ఆధ్యాత్మిక చింతన కలిగిన వాడై ఉండాలని, తన లాగే దేవుడిపై నమ్మకంతో పాటు భక్తిభావం ఉన్న వ్యక్తి తనకు భర్తగా రావాలని అంటోంది రాశీ ఖన్నా. అలాంటి వ్యక్తి కోసమే గాలిస్తున్నట్టు ఆమె చెప్పింది. ఆ సుగుణాలు కలిగిన వ్యక్తినే తాను వరుడిగా ఎంచుకుని పెళ్లి చేసుకుంటానని రాశీఖన్నా చెప్పడంతో ఆమె పెళ్లి మ్యాటర్ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ మ‌ధ్య అందాల ఆర‌బోత‌ డోస్‌ పెంచేస్తున్న రాశీ.. ప్రస్తుతం తమిళ తంబీలను ఆకట్టుకునే పనిలో పడింది. ఆమె చేతిలో ఇప్పుడు ఏకంగా తొమ్మిది సినిమాలు ఉండటం విశేషం. తుగ్లక్ దర్బార్, అరణ్మనై , భ్రమమ్, పక్కా కమర్షియల్, థాంక్యూ , సర్దార్, తిరుచిత్రం బలం, మేథవి, సైతాన్ కా బచ్చా సినిమాల్లో రాశీఖన్నా నటిస్తోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3zQifOj

No comments:

Post a Comment

'Government Must Talk To Sonam Wangchuk'

'Ladakh has become a hollow UT.' from rediff Top Interviews https://ift.tt/MtBvKLU