ఆయన సినిమాలు ఎప్పటికీ క్లాసిక్ హిట్లుగా నిలుస్తాయి. విలక్షణమైన రీతిలో సినిమాలు చేయడంలో ఆయన ఎప్పుడూ ముందు ఉంటారు. ఆయన తీసిన సినిమాలు చూసి ప్రేక్షకుడికి ఎంతో మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తుంది. ఆయనే దర్శకుడు మణిరత్నం. మిగితా దర్శకుడలతో పోలిస్తే.. చేసే సినిమాలు ఎంతో వేరుగా ఉంటాయి. ఆహ్లాదకరమైన వాతావరణం, మంచి రొమాన్స్, గొప్ప సీనరీలు చూపిస్తుంటారు మణిరత్నం. అందుకే ఆయన నుంచి వచ్చే సినిమాలు అంటే ప్రేక్షకుల్లో ఓ డిఫరెంట్ క్రేజ్ ఉంటుంది. అయితే తాజాగా మణిరత్నంకు అనుకోని షాక్ ఎదురైంది. అనూహ్యంగా ఆయనపై ఓ పోలీస్ కేసు నమోదు అయింది. అయితే అందుకు కారణంగా లేకుండా పోలేదు. ప్రస్తుతం మణిరత్నం ‘పొన్నియన్ సెల్వం’ అనే సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ శివార్లలోని అబ్దుల్లాపూర్ మెట్ మండలం అనాజ్ పూర్ గ్రామంలోని వ్యవసాయక్షేత్రంలో '' షూటింగ్ జరిగింది. ఈ క్రమంలో గ్యాప్ లేకుండా షూటింగ్ జరగడంతో ఈ షూటింగ్‌లో పాల్గొంటున్న ఓ గుర్రం మృతి చెందింది. డీహైడ్రేట్ అయిన గుర్రాలను ఈ సినిమా షూటింగ్‌లో ఉపయోగించారు అని తెలిసింది. ఈ ఘటనపై తెలంగాణ పోలీసులకు ఇండియా ఫిర్యాదు చేసింది. దీంతో మణిరత్నంతో పాటు గుర్రం యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పీసీఏ చట్టం, 1960 సెక్షన్ 11, 1860 ఇండియన్ పీనల్ కోడ్, సెక్షన్ 429 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇక ఈ సినిమా విషయానికొస్తే.. ఐశ్వర్య రాయ్, త్రిష, జయం రవి, విక్రమ్, కార్తి, ప్రకాశ్ రాజ్ వంటి స్టార్లు ఈ సినిమాలో నటిస్తున్నారు. అస్కార్ అవార్డు గ్రహిత ఏఆర్ రహమాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. మరి ఈ కేసు నుంచి మణిరత్నం బయటపడతారో.. లేక.. ఇబ్బందుల్లో పడతారో తెలియాలి అంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3BEtcmA
No comments:
Post a Comment