Tuesday 7 September 2021

సీనియర్ నటుడు శుభలేఖ సుధాకర్‌ ఇంట విషాదం.. ఆయన తల్లి కన్నుమూత

సీనియర్ నటుడు తల్లి ఎస్‌ఎస్‌ కాంతం (82) కన్నుమూశారు. వయసు మీద పడటంతో అనారోగ్య సమస్యలు తలెత్తి ఆమె మంగళవారం రాత్రి చెన్నైలో మరణించినట్లు తెలిసింది. సుమారు మూడు నెలల క్రితం గుండెపోటుకు గురైన కాంతం.. ఆ తర్వాత వైద్యుల పర్యవేక్షణలో ఇంట్లోనే చికిత్స పొందుతూ ఆరోగ్యం క్షీణించి తుదిశ్వాస విడిచారు. చెన్నై మహాలింగపురంలోని సుధాకర్‌ నివాసంలో తండ్రి సూరావజ్జల కృష్ణారావు, తల్లి ఎస్‌ఎస్‌ కాంతం ఉండేవారు. రెండేళ్ల క్రితం కృష్ణారావు మరణించారు. కృష్ణారావు, కాంతం దంపతులకు ముగ్గురు కుమారులు. అందులో శుభలేఖ సుధాకర్‌ పెద్దవారు కాగా రెండో కొడుకు మురళీ దత్తు వైజాగ్‌లో స్థిరపడ్డారు. మూడో కుమారుడు సాగర్‌ అట్లాంటాలో ఉంటున్నారు. సుధాకర్‌కు మాతృవియోగం జరిగిందని తెలిసి పలువురు సినీ ప్రముఖులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం చెన్నైలో కాంతం అంత్యక్రియలు జరుగనున్నాయి. శుభలేఖ సుధాకర్‌ అసలు పేరు సూరావజ్జల సుధాకర్. 'శుభలేఖ' చిత్రంలో నటించి ఆ తర్వాత ఆయన ఆ పేరుతోనే సుపరిచితుడయ్యాడు. కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన శుభలేఖ చిత్రంలో చిరంజీవి - సుమలత ప్రధాన జంటగా నటించగా, సుధాకర్ - తులసి మరో జంటగా నటించారు. ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం చెల్లెలు, గాయని ఎస్.పి.శైలజను శుభలేఖ సుధాకర్ పెళ్లాడారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3BNZYBG

No comments:

Post a Comment

'Israel Will Engineer A Broader War'

'Israel is counting on the United States to enter the fray on their behalf and perform destructive strikes against these targets that ar...