Thursday 2 September 2021

శుభాకాంక్షల వెల్లువపై పవన్ కళ్యాణ్ స్పందన.. దైవ చింతనలో గడిపానంటూ సుదీర్ఘ పోస్ట్

నిన్న (సెప్టెంబర్ 2) పవర్ స్టార్ సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. మెగా అభిమాన వర్గాలతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు పెద్దఎత్తున పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. దీంతో సోషల్ మీడియాలో విషెస్ మోత మోగింది. బర్త్ డే కానుకగా ఆయన కొత్త సినిమాల అప్‌డేట్స్ కొత్త ఉత్సాహాన్నిచ్చాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో పవన్ ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా తనకు అందిన బర్త్ డే విషెస్‌పై పవన్ కళ్యాణ్ రియాక్ట్ అవుతూ సుదీర్ఘ నోట్ రాశారు. తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పిన పవన్ కళ్యాణ్ తన సందేశాన్ని పోస్ట్ చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. ''నా చుట్టూ ఉన్న సమాజం ఎల్లవేళలా క్షేమంగా ఉండాలనే భగవంతుణ్ణి ప్రార్థిస్తుంటాను. ఏడాదిన్నర కాలంగా దేశం కరోనా మహమ్మారితో పోరాడుతూనే ఉంది. సెకండ్ వేవ్ ప్రభావం నుంచి ఇప్పుడిప్పుడే కుదుటపడుతుంది. కష్ట జీవుల జీవనం ఇంకా గాడినపడలేదు. ఇలాంటి క్లిష్ట సమయంలో జన్మదిన శుభాకాంక్షలు అందుకోలేను అనే ఉద్దేశంతో దైవ చింతనలో గడిపాను. సహజంగానే నేను పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉంటానని నన్ను అభిమానించే వారికి తెలుసు. నాపై ఉన్న ప్రేమాభిమానాలతో ఎందరో హితైషులు, సన్మిత్రులు, శ్రేయోభిలాషులు, సమాజ సేవకులు, రాజకీయ నేతలు, సినీ తారలు, దర్శకులు, సాంకేతిక నిపుణులు, మీడియా ప్రతినిధులు, ప్రవాస భారతీయులు, నన్ను తమలో ఒకడిగా భావించే అభిమానులు, జన సైనికులు, వీర మహిళలు, జనసేన నాయకులు సామాజిక మాధ్యమాల ద్వారా శుభాకాంక్షలు అందచేశారు. జనసేన శ్రేణులు, అభిమానులు సామాజిక సేవ కార్యక్రమాలు చేపట్టి తమ అభిమానాన్ని సేవామార్గంలో వెల్లడించారు. పెద్దలు, రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారు శుభాశీస్సులు అందించారు. ప్రతి ఒక్కరూ ఎంతో వాత్సల్యంతో నాకు శుభాకాంక్షలు అందించారు. వెల కట్టలేని ఈ అభిమానానికి, వాత్సల్యానికి నేను సర్వదా కృతజ్ఞుడిని. అందరికీ పేరుపేరునా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను'' అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3zIHVMH

No comments:

Post a Comment

'How Can A 16 Year Old Be A BJP Agent?'

'I went to jail and met my father to convince him to join politics and believe in the Constitution.' from rediff Top Interviews ht...