Wednesday, 22 September 2021

రాత్రిపూట షూటింగ్.. చేయి పట్టుకున్నారు.. సాయి పల్లవి షాకింగ్ కామెంట్స్

సెకండ్ వేవ్ తరువాత థియేటర్లోకి రాబోతోన్న పెద్ద చిత్రం. అటు బడ్జెట్ పరంగా చూసినా, క్యాస్టింగ్ పరంగా చూసినా, అంచనాల పరంగా చూసినా కూడా ఎంతో ఎత్తులో ఉంది. , సాయి పల్లవి, కాంబినేషన్‌లో రాబోతోన్న లవ్ స్టోరీ చిత్రం కోసం అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పాటలు రెండు తెలుగు రాష్ట్రాల్లోని యూత్‌ను ఓ ఊపు ఊపేశాయి. సెప్టెంబర్ 24న ఈ చిత్రం థియేటర్లోకి రాబోతోంది. ఈ మేరకు ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాతో ముచ్చటిచింది. ఈ క్రమంలో కొన్ని విషయాల మీద సాయి పల్లవి స్పందించింది. శేఖర్ కమ్ముల ఎంత సాధారణంగా ఉంటారో.. కనిపిస్తారో అందరికీ తెలిసిందే. ఇది విషయాన్ని చెబుతూ శేఖర్ కమ్ములతో పని చేయడం వల్ల తనలో వచ్చిన మార్పుల గురించి సాయి పల్లవి చెప్పుకొచ్చింది. తాను ఇదివరకన్నా సున్నితంగా మారిపోయానని, ఆయన ఎక్కడైనా సాధారణంగానే ఉంటారని, నేల మీదే కూర్చొని పనిచేస్తారని తెలిపింది. అలాంటి సాధారణ జీవితాన్ని తాను కూడా అలవాటు చేసుకున్నానని చెప్పుకొచ్చింది. లవ్ స్టోరీ ఎక్కువగా రూరల్ ఏరియాలో జరిగింది. ఎక్కువగా అవుట్ డోర్ చేయాల్సి వచ్చింది. దానిపై సాయి పల్లవి మాట్లాడుతూ.. తాను తెలుగు అమ్మాయిలానే ఫీల్‌ అవుతానని చెప్పుకొచ్చింది. ‘ఫిదా’ కోసం బాన్సువాడ, ఇప్పుడు ఆర్మూర్‌ దగ్గర పిప్రీలో చేశామని తెలిపింది. అక్కడి జనం హీరోహీరోయిన్లనే తేడా లేకుండా మాతో మాట్లాడారని పేర్కొంది. కోవిడ్‌ సమయంలో, రాత్రిపూట షూటింగ్‌ జరిగినా విసుక్కోలేదని తెలిపింది. దగ్గర కూర్చొని చేయిపట్టుకుని ప్రేమగా మాట్లాడారని, చిన్నచిన్న విషయాలు అడిగి తెలుసుకున్నారని చెప్పుకొచ్చింది. బాన్సువాడలో ఓ స్థానిక డిజైనర్‌ చీరను కూడా కానుకగా ఇచ్చారని తెలిపింది. గ్రామాలకు వెళ్తే అక్కడే ఉండిపోవాలి అనిపిస్తుందని, అంత ప్రేమగా ఉంటారని చెప్పుకొచ్చింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/39r5rSX

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....