తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ 5 ఆదివారం రోజున అట్టహాసంగా ప్రారంభమైంది. 19 మంది కంటెస్టెంట్స్ బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చేశారు. ఈ ఐదు సీజన్స్‌లో తొలి రెండు సీజన్స్ మినహా మిగిలిన మూడు సీజన్స్(జరుగుతున్న సీజన్‌తో సహా)కు అక్కినేని నాగార్జునే వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. ఈ సీజన్ ప్రారంభంలోఒకానొక దశలో నాగార్జున కూడా హోస్ట్ చేయబోవడం లేదంటూ వార్తలు హల్‌చల్ చేశాయి. అయితే నిర్వాహకులు మాత్రం నాగార్జునకే ఓటేశారు. అయితే ఈ సీజన్ ప్రారంభానికి హోస్టింగ్ విషయంలో ముందు చాలా తతంగమే నడిచిందని..అందుకనే నాగార్జున స్థానంలో మరొకరిని తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఏం జరిగిందనే వివరాల్లోకెళ్తే... హోస్ట్ నాగార్జున బిగ్‌బాస్ సీజన్ 3ను బాగానే హ్యాండిల్ చేశారు. మంచి క్రేజ్ కూడా వచ్చింది. దాంతో ఆయన నాలుగో సీజన్‌కు రెమ్యునరేషన్ కాస్త పెంచమని డిమాండ్ చేశారు. అప్పుడు కరోనా పరిస్థితులు దీంతో షో ప్రారంభం కావడమే మహా ప్రసాదం అనుకుని నాగార్జున డిమాండ్‌ను ఓకే చేశారు. నాలుగో సీజన్ కూడా సక్సెస్‌ఫుల్‌గా ముగిసింది. ఇప్పుడు ఐదో సీజన్ విషయంలో మరోసారి నాగార్జున రెమ్యునరేషన్ విషయంలో మరి కాస్త ఎక్కువ డిమాండ్ చేశారట. సినీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం మేరకు మొత్తం సీజన్‌కుఏ కలిపి దాదాపు రూ.11-12 కోట్ల రూపాయలను డిమాండ్ చేశాడట. అమ్మో అంతనా! హోస్ట్‌ను మార్చేస్తే పోలా.. అని నిర్వాహకులు భావించి, కొత్త హోస్ట్ కోసం గట్టిగానే ప్రయత్నాలు చేశారట. అయితే అవేం వర్కవుట్ కాలేదని, అదిగాక, నాగార్జున హోస్టింగ్‌కు ఆడియెన్స్ కనెక్ట్ అయ్యారని భావించిన నిర్వాహకులు ఆయనడిగినంత ఇవ్వడానికి ఓకే చేశారని టాక్ వినిపిస్తోంది. అయితే ఓ వర్గం మాత్రం నాగార్జున డిమాండ్ చేసిన దాంట్లో తప్పులేదని, నాగార్జున అంతకు ముందు చేసిన మీలో ఎవరు కోటీశ్వరుడు చాలా పెద్ద హిట్.. అలాగే బిగ్‌బాస్ సీజన్ 3, సీజన్ 4 కూడా పెద్ద హిట్. ఇప్పుడు జరగబోయే మరో సీజన్‌కు ఆయనే పక్కాగా సూట్ అవుతాడని అందుకనే బిగ్‌బాస్ నిర్వాహకులు కూడా ఓకే చెప్పారని అంటున్నారు. బిగ్‌బాస్ సీజన్ 5 తెలుగు షో .. వందరోజుల పాటు జరగనుంది. మరి పదిహేను వారాల పాటు జరగబోయే ఈ సీజన్‌కు ఆ రేంజ్‌లో డేట్స్ ఇచ్చేటప్పుడు డిమాండ్ చేయడంలో తప్పులేదని అంటున్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3yOc1gz
No comments:
Post a Comment