Friday 10 September 2021

సాయిధరమ్ తేజ్‌ హెల్త్ బులిటెన్.. ఐసీయూలేనే 48 గంటలు గడవాలంటున్న డాక్టర్లు

మెగా ఫ్యామిలీకి చెందిన హీరో శుక్ర‌వారం రాత్రి 8.30 నిమిషాల‌కు యాక్సిడెంట్ బారిన ప‌డ్డారు. ఆయ‌న ప్ర‌యాణిస్తున్న స్పోర్ట్స్ బైక్ స్కిడ్ కావ‌డంతో ఈ ప్ర‌మాదం జ‌రిగింది. కుడిక‌న్ను, పొట్ట‌, ఛాతీ భాగంతో పాటు కాలికి గాయాల‌య్యాయి. ప్రస్తుతం సాయిధరమ్ తేజ్‌కు అపోలో వైద్యులు డాక్టర్ అలోక్ రంజాన్ న్యూరోసర్జరీ, డాక్టర్ సుబ్బారెడ్డి క్రిటికల్ కేర్, డాక్టర్ సాయి ప్రవీణ్ హరనాథ్ పాలమనాలకిస్ట్, డాక్టర్ బాలవర్ధన్ రెడ్డి ఆర్థోపెడిక్స్ చికిత్స‌ను అందిస్తున్నారు. చికిత్స అన‌త‌రం డాక్ట‌ర్లు మీడియాతో మాట్లాడారు. ‘‘సాయితేజ్‌గారు మైండ్‌స్పేస్ జంక్ష‌న్ ద‌గ్గ‌ర బైక్ ప్ర‌మాదానికి గుర‌య్యారు. దగ్గ‌ర‌లోని హాస్పిట‌ల్‌కు ఆయ‌న్ని తీసుకెళ్లి ప్రాథ‌మిక చికిత్స‌లు అందించారు. తర్వాత అపోలోకు తీసుకొచ్చారు. ఇక్క‌డ మేం కూడా న్యూరో స‌ర్జ‌న్‌, క్రిటిక‌ల్ కేర్, ఐసీయు స‌ర్జ‌న్‌ ప‌రంగా మేం కూడా అబ్జ‌ర్వ్ చేశాం. కాల‌ర్ బోన్‌(భుజం ఎముక) ఫ్రాక్చ‌ర్ అయ్యింది. ఇప్ప‌టికైతే సాయితేజ్ బావున్నాడు. ప‌ర్య‌వేక్షిస్తున్నాం. 48 గంట‌ల వ‌ర‌కు ఏమీ చెప్ప‌డానికి ఉండ‌దు. ఎందుకంటే బైక్‌పై నుంచి ప‌డ్డ‌ప్పుడు ఎక్క‌డైనా గాయాలు కావ‌చ్చు. కాబ‌ట్టి అతన్ని క్లోజ్‌గా మానిట‌ర్ చేస్తున్నాం. ఆయ‌న త‌ప్ప‌కుండా కోలుకుంటారు. మ‌నం ఆయ‌న కోసం ప్రార్థిస్తాం. వెంటిలేట‌ర్‌పై ఉన్నారు. కానీ భ‌య‌ప‌డ‌టానికి ఏమీ లేదు. యాక్సిడెంట్ జ‌రిగిన‌ప్పుడు అవ‌స‌రం అనుకుంటే వెంటిలేట‌ర్ స‌పోర్ట్ ఇస్తాం. దాని గురించి బ్యాడ్‌గా ఆలోచించాల్సిన అవ‌సరం లేదు’’ అని తెలిపారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3k7gfvH

No comments:

Post a Comment

What Ratan Tata Told Harvard: Must Read

'What's sad today is that there are so many people who cannot find work, not because the country is devoid of that opportunity, but ...