యాంగ్రీ స్టార్ రాజశేఖర్ వారసత్వాన్ని కొనిసాగిస్తూ ఆయన కూతుళ్లిద్దరూ కూడా సినీ రంగంలోకి అడుగుపెట్టేశారు. ఇప్పటికే చిన్న కూతురు శివాత్మిక ఇప్పటికే ‘దొరసాని’గా పరిచయం కాగా.. ఇప్పుడు పెద్ద కూతురు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే శివానీ సినీ ఎంట్రీ కావాల్సి ఉన్నా ఎంట్రీకి పలుమార్లు అడ్డంకులు రావడంతో పరిచయం కాలేకపోయింది. ఇప్పుడు డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీతో అందరి ముందుకొస్తోంది. 118 వంటి సూపర్‌హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవి గుహన్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ WWW మూవీ నుంచి ఇప్పటికే వదిలిన పాటలు యూట్యూబ్‌లో భారీ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఈ మూవీలో `మిత్ర` అనే పాత్రలో శివాని నటిస్తుండగా.. ఇందులో అదిత్ అరుణ్, శివాని రాజశేఖర్ కెమిస్ట్రీ హైలెట్ అవుతుందని ఇప్పటికే విడుదలైన అప్డేట్ల ద్వారా తెలిసింది. ఈ నేపథ్యంలో సినిమాపై ఆసక్తి రెట్టింపు చేసేలా తాజాగా ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ భాగస్వామ్యంతో రిలీజ్ చేస్తున్నట్లు పేర్కొంటూ ఓ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మేరకు చిత్ర సన్నివేశాలతో కూడిన ఓ చిన్న వీడియో వదిలారు. సురేష్ ప్రొడక్షన్స్ భాగస్వామ్యంతో థియేటర్స్‌లో ప్రేక్షకుల ముందుకు రానుండటం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. తాజాగా వదిలిన ఈ వీడియో చూస్తుంటే ఈ సినిమాను గతంలో ఎన్నడూలేని విధంగా ఓ డిఫరెంట్ కంటెంట్‌తో తెరకెక్కించారని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని రామంత్ర క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా డా. రవి పి. రాజు దాట్ల నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు రియాక్ట్ అవుతూ.. రీసెంట్‌గా ఈ సినిమా చూశాను. క్రిస్పీ నేరేషన్‌తో మంచి పెర్‌ఫామెన్స్‌లతో చాలా థ్రిల్లింగ్ గా తెరకెక్కించారు. ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల్ని, ఈ కరోనా వల్ల వర్చువల్ వరల్డ్‌లో వచ్చిన మార్పులని చక్కగా చూపించారు. అంతర్లీనంగా ఒక మంచి ప్రేమకథ కూడా ఉంది. ఆడియోకి ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది. WWW వంటి ఒక మంచి చిత్రాన్ని మీకు థియేటర్లలో అందిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉందని అన్నారు. దర్శకుడు కేవీ గుహన్ మాట్లాడుతూ - ``సినిమా చాలా బాగా వచ్చింది. సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో ఈ మూవీ విడుదలవడం నిజంగా హ్యీపీగా ఉంది. అదిత్, శివాణి ఇద్దరు చాలా బాగా నటించారు. టెక్నీషియన్స్ అందరూ మంచి సపొర్ట్ అందించారు. తప్పకుండా ఒక డిఫరెంట్ మూవీ అవుతుంది`` అన్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3kjbOMZ
No comments:
Post a Comment