Tuesday 24 August 2021

Trivikram: సుమపై త్రివిక్రమ్ షాకింగ్ కామెంట్స్.. చిరంజీవి లాంటి వాళ్లే అలా! పేలిన మాటల తూటాలు

మాటల మాంత్రికుడు.. స్టార్ డైరెక్టర్ గురించి ఒక్కమాటలో చెప్పాలంటే ఎవ్వరైనా ముందుగా చెప్పేమాట ఇదెక్కటే. ఆయన రాసే డైలాగ్స్, సందర్బానుసార రియాక్షన్స్ అలా ఉంటాయి మరి. ఇక బుల్లితెర మాటల మహారాణి ఎవరంటే ఏ మాత్రం ఆలోచించకుండా ఎవ్వరైనా యాంకర్ అనే చెబుతారు. కార్యక్రమాన్ని హోస్ట్ చేయాలన్నా, స్పెషల్ ఈవెంట్స్ హ్యాండిల్ చేయాలన్నా ఫస్ట్ ఛాయిస్ సుమనే అంటారంతా. ఇక ఆయా వేదికలపై ఆమె చూపే చలాకీతనం, వేసే పంచులైతే మామూలుగా ఉండవు. తాజాగా అలాంటి సుమ, త్రివిక్రమ్ ఇద్దరూ ఒక్కచోట చేరి తెగ హంగామా చేశారు. మంగళవారం సాయంత్రం జరిగిన ‘’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి వచ్చిన త్రివిక్రమ్ శ్రీనివాస్, అదే ఈవెంట్‌ని హోస్ట్ చేస్తున్న సుమపై చేసిన కామెంట్స్ ప్రతి ఒక్కరినీ కడుపుబ్బా నవ్వించాయి. ''సుమతో చాలా జాగ్రత్తగా ఉండాలి.. చిరంజీవి లాంటి వారే స్టేజ్ పైకి వచ్చే ముందు వేదికపై ఏం మాట్లాడాలో ఆలోచించుకుంటారు. అంటే అంత జాగ్రత్తగా ఉంటారన్నమాట. మనం ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్కినేని నాగేశ్వరరావు లాంటి వారే సుమను హ్యాండిల్ చేయగలరు. ఏదేమైనా సుమ గారిని చాలా రోజుల తర్వాత స్టేజ్ పైన ఇలా చూడటం చాలా ఆనందంగా ఉంది'' అని త్రివిక్రమ్ అనడంతో పక్కనే ఉన్న సుమ ఆనందం అవధులు దాటేసింది. ఇకపోతే ఈ ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ సినిమా గురించి రియాక్ట్ అయిన త్రివిక్రమ్ చిత్రయూనిట్ అందరిని ఉద్దేశిస్తూ పాజిటివ్‌గా మాట్లాడారు. ఈ సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికి మంచి విజయం దక్కాలని ఆయన కోరుకున్నారు. ప్రస్తుతం ప్రపంచం మొత్తంలో థియేటర్‌కి రావడానికి సాహసిస్తున్నది తెలుగు జాతి మాత్రమే అంటూ త్రివిక్రమ్ చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో నూతనోత్సాహం నింపాయి. ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ సినిమాలో సుశాంత్ హీరోగా నటించగా మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించింది. ఎస్‌.దర్శన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు రవిశంకర్‌ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హరీష్‌ కోయలగుండ్ల నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ నెల 27న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Wnpmi2

No comments:

Post a Comment

'Overconfidence Caused Cong Defeat'

'Congress leaders are ready to lose the election and not form the government, but are never ready to share seats with others.' fro...