Sunday 22 August 2021

ఎవరికి వారే యమునా తీరే!! MAA బిల్డింగ్ ఇష్యూపై మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ () ఎన్నికలపై రోజుకో రకమైన చర్చ తెరపైకి వస్తుండటం చూస్తున్నాం. ఎప్పటిలాగే ‘మా’ ఎన్నికల వ్యవహారం మరోసారి సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. 'మా' అధ్యక్ష పోటీలో ఐదుగురు బరిలోకి దిగారు. ఈ ఐదుగురిలో ప్రకాష్ రాజ్, మంచు విష్ణు దూకుడుగా అడుగులేస్తున్నారు. ఇప్పటికే ప్రకాష్ రాజ్ తన కార్యవర్గ సభ్యులను ప్రకటించి సమరానికి సై అంటుండగా.. మంచు విష్ణు తన బలాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ పరిస్థితుల నడుమ వాడివేడిగా జరిగిన 'మా' అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో సీనియర్ నటుడు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో గందరగోళ పరిస్ధితులు కనిపిస్తున్నాయని, తాజా పరిణామాలు చూస్తుంటే ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉందని ఆయన ఫైర్ అయ్యారు. అదేవిధంగా ఇష్యూపై రియాక్ట్ అవుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు మోహన్ బాబు. ‘మా’ భవనం కోసం రూపాయికి కొన్న స్థలాన్ని అర్థ రూపాయికి అమ్మేశారని, స్థలం కొని మళ్లీ అమ్మేయడం ఎంతవరకు సమంజసం అని మోహన్ బాబు ప్రశ్నించారు. అసోసియేషన్ భవనం విషయం తనని ఎంతో కలిచివేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు కృష్ణంరాజు అధ్యక్షతన జరిగిన ఈ సర్వసభ్య సమావేశంలో పలువురు 'మా' సభ్యులు పాల్గొని తమ తమ అభిప్రాయాలు వెల్లడించారు. ఈ కార్యవర్గ సమావేశంలో ఎన్నికల నిర్వహణ అంశం ప్రధానంగా చర్చకు వచ్చినట్లు తెలిసింది. ఎలాంటి అవాంతరాలు జరగకుండా, అన్ని జాగ్రత్తలు తీసుకొని ఎన్నికలు నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. కాగా అందరి అభిప్రాయాలు సేకరించిన క్రమశిక్షణ కమిటీ సంఘం నాయకులు కృష్ణంరాజు, మురళీమోహన్‌.. MAA ఎన్నికల తేదీ ఎప్పుడనే విషయాన్ని మరో వారం రోజుల్లో నిర్ణయిస్తామని చెప్పినట్లు సమాచారం.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2WgZQvl

No comments:

Post a Comment

'Preparing to enter affordable housing loans space'ns'

'Focus will be on smaller loan amounts to meet the needs of affordable homebuyers.' from rediff Top Interviews https://ift.tt/J1zq...