Sunday, 22 August 2021

HBD Chiranjeevi: అందరి విషెస్‌పై మెగాస్టార్ రెస్పాన్స్.. అదే అసలైన రక్ష అంటూ ట్వీట్లు

ఆయన పేరు చెబితే చాలు టాలీవుడ్ బాక్సాఫీస్ మాత్రమే కాదు.. యావత్ దేశ బాక్సాఫీస్‌ మొత్తం షేక్ అవుతోంది. తన ‘స్వయంకృషి’తో హీరోగా పైకి వచ్చిన.. ఎంట్రీ ఇచ్చిన కొంతకాలంలోనే ‘మెగాస్టార్’గా ఎదిగారు. ఆయన సినిమా రిలీజ్ అయిందంటే రికార్డులు మారుమోగిపోవాల్సిందే. ఆయన సినిమా వస్తుంది అంటే.. చాలా మంది సినిమాలు వాయిదా వేసుకొనే సందర్భాలు చాలానే ఉన్నాయి. ఆయనే మెగాస్టార్ చిరంజీవి. అలాంటి సినిమా వస్తుందంటే ఇక అది అభిమానులకు పండగే.. ఇక మెగాస్టార్ పుట్టినరోజు వస్తుందటే.. ఆ రోజుని అభిమానులు ఓ పండుగలా జరుపుకుంటారు. అయితే ఈ ఏడాది నిజంగానే పండుగ రోజున మెగాస్టార్ పుట్టినరోజు వచ్చింది. ఆదివారం (ఆగస్టు 22న) కావడంతో.. దాంతో పాటు రాఖీ పండుగ కూడా కావడంతో సంబరాలు నెక్ట్స్ లెవల్‌కి వెళ్లిపోయాయి. చిరు సినిమాల నుంచి వరుసగా అప్‌డేట్లతో ఫ్యాన్స్‌ ఉక్కిరి బిక్కిరి అయిపోయారు. ముఖ్యంగా వేదాలం రీమేక్‌గా రూపొందుతున్న సినిమా టైటిల్‌ని తాజాగా ప్రకటించారు. ఈ సినిమా టైటిల్ ‘భోళ శంకర్’ కాగా.. ఈ సినిమాలో చిరు చెల్లెలిగా కీర్తి సురేష్ నటిస్తోంది. రాఖీ పండుగ సందర్భంగా ఓ ప్రత్యేకమైన వీడియోని కూడా విడుదల చేసింది చిత్ర యూనిట్. ఇక చిరంజీవికి.. దేశవ్యాప్తంగా ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలి అని కోరుకుంటూ వాళ్లు ట్వీట్లు చేశారు. ఇక ఫ్యాన్స్ అయితే చిరుకి విషెస్ చెబుతూ సోషల్‌మీడియాలను షేక్ చేశారు. అయితే అందరి విషెస్‌కి చిరు రెస్పాన్స్ ఇచ్చారు. ముందుగా రాఖీ పండుగకు ప్రాధాన్యత ఇస్తూ.. ‘నిజానికి చెల్లెళ్ళ ప్రేమే అన్నయ్య కి శ్రీరామ రక్ష.. అందరికీ రక్షబంధన్ శుభాకాంక్షలు’ అంటూ చిరు ట్వీట్ చేశారు. ఆ తర్వాత తనకు విషెస్ చెప్పిన మిత్రులు, ఫ్యాన్స్, సోదరసోదరీమణులు, తోటి కళాకారులు మిగితా సినిమా కుటుంబానికి ఆయన ధన్యవాదాలు చెబుతూ మరో ట్వీట్‌ని పెట్టారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/381wmE0

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....