Saturday 21 August 2021

మెగా అభిమానం ఇలా చూపించారు!.. భార్యతో కలిసి ఆట సందీప్ హల్చల్

కొరియోగ్రఫర్ చిరంజీవికి డై హార్డ్ ఫ్యాన్ అన్న సంగతి తెలిసిందే. ఆట సందీప్ గురించి మాట్లాడకుండా, ప్రస్థావించకుండా ఏ ఇంటర్వ్యూ గానీ, ప్రసంగం గానీ ఉండదు. చిరు చూపిన దారిలోనడుస్తుంటారు. రక్తదానం చేస్తుంటారు.. మొక్కలు నాటుతుంటారు.. సినీ కార్మికుల సాయం చేస్తుంటారు. ఇలా ఎన్నెన్నో మంచి పనులు చేస్తూ మెగా బాటలో నడుస్తుంటారు. అలాంటి ఆట సందీప్ తన భార్య జ్యోతి రాజ్‌తో కలిసి చిరంజీవి బర్త్ డేకు స్పెషల్‌గా రాబోతోన్నారు. చిరంజీవి బర్త్ డే అంటే మెగా అభిమానులకు పెద్ద పండుగే. చిరుకు అభిమానులు అంటే.. బయటే కాదు.. ఇండస్ట్రీ లోపల కూడా ఉంటారు. ఆ మాటకు వస్తే.. ఎక్కడైనా సరే చిరు అభిమానులు ఉంటారు. ఆయన మాట్లాడే మాటలకు, వేసే స్టెప్పులకు, చేసే మంచి పనులకు ఎవ్వరైనా సరే దాసోహం అవ్వాల్సిందే. అయితే చిరు బర్త్ డే అంటే ఒక్కొక్కరు ఒక్కోలా తమ అభిమానాన్ని చాటుతుంటారు. గత ఏడాది సుధాకర్ తన బార్యతో కలిసి సందెపొద్దులా కాడ అంటూ నాటి క్లాసిక్ సాంగ్‌ను పర్ఫామెన్స్ చేశారు. ఆ వీడియోను చూసి చిరంజీవి ఎంతో ముచ్చటపడ్డారు. ఆ గ్రేస్, ఆ మూమెంట్స్ అన్నీ కూడా బాగున్నాయంటూ ఆ దంపతులను ప్రశంసించారు. ఇక ఈ సారి ఈ బర్త్ డేకు ఆట సందీప్ తన ప్రేమను చాటేందుకు వస్తున్నారు. చిరు అంటే మాస్. మాస్ అంటే చిరు. అలాంటిది చిరంజీవి మాస్ స్టెప్పులను మరోసారి గుర్తు చేస్తూ ఆట సందీప్ రాబోతోన్నారు. అందరివాడు సినిమాలోని కోడి కూరు చిల్లు గారె అనే పాటకు ఆట సందీప్ మాస్ స్టెప్పులు వేసినట్టు కనిపిస్తోంది. నేడు (ఆగస్ట్ 21) ఈ వీడియో రిలీజ్ కానుంది. ఈ మేరకు వదిలిన ప్రోమో ఇప్పటికే నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. మొత్తానికి మెగా సంబరాలు మాత్రం అన్ని చోట్లా ప్రారంభమయ్యాయి. రేపు మెగా మూవీ అప్డేట్లతో సోషల్ మీడియా షేక్ కానుంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3B1AOyW

No comments:

Post a Comment

'I'm Being Used As A Potato For 25 Years'

'...be it a comedy, thriller or a love story.' from rediff Top Interviews https://ift.tt/5orx1p9