Thursday, 26 August 2021

శ్రీదేవి సోడా సెంటర్ ట్విట్టర్ రివ్యూ: ప్రీమియర్ రిపోర్ట్స్ ఎలా ఉన్నాయంటే..

రీసెంట్‌గా 'V' సినిమాతో ఓటీటీ వేదికపై అలరించిన యంగ్ హీరో సుధీర్ బాబు.. ఇప్పుడు '' థియేటర్స్‌లోకి దిగాడు. ఈ మూవీ కోసం తన లుక్ మార్చేసి సిక్స్ ప్యాక్ బాడీతో లైటింగ్ సూరిబాబుగా రంగంలోకి దూకాడు. పలాస1978 ఫేమ్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సుధీర్ బాబు సరసన ఆనంది హీరోయిన్‌గా నటించింది. 70 ఎమ్ ఎమ్ ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై ప్రొడ‌క్ష‌న్ నెం. 4గా విజ‌య్ చిల్లా, శ‌శిదేవి రెడ్డి నిర్మించగా మ‌ణిశ‌ర్మ సంగీతం అందించారు. నరేష్, రఘుబాబు, అజయ్‌, సత్యం రాజేశ్‌, హర్షవర్థన్‌, సప్తగిరి, రోహిణి తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకు మొదటి నుంచే బెస్ట్ ప్రమోషన్స్ చేసి హైప్ క్రియేట్ చేసుకున్నారు మేకర్స్. టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచాయి. ఈ పరిస్థితుల నడుమ నేడు (ఆగస్టు 27) సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. అయితే గత రాత్రి యూఎస్ ప్రీమియర్స్ చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా ఈ సినిమా ఎలా ఉందో చెబుతున్నారు. ముందుగా ఈ సినిమాకు ఆల్ ది బెస్ట్ చెబుతూ దగ్గుబాటి వెంకటేష్ తన సపోర్ట్ అందించారు. చిత్ర ట్రైలర్ చాలా బాగుందని, బిగ్ స్క్రీన్‌పై మ్యాజిక్ క్రియేట్ చేస్తుందని అన్నారు. అదే విధంగా తోటి హీరో సాయి ధరమ్ తేజ్.. సుధీర్ బాబుకు ఆల్ ది బెస్ట్ చెబుతూ ట్వీట్ చేశారు. ఇక ఈ మూవీ ప్రీమియర్స్ చూసిన ఆడియన్స్ సుధీర్ బాబు నటనను తెగ పొగిడేస్తున్నారు. సినిమా ఆరంభం నుంచి చివరిదాకా సుధీర్ బాబు తన పర్‌ఫార్‌మెన్స్‌తో ఇరగదీశారని అంటున్నారు. యాక్షన్ సీన్స్ చాలా బాగున్నాయని, సుధీర్ బాబు మాస్ ఆడియన్స్‌ని ఆకట్టుకున్నారని అంటున్నారు. మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు మేజర్ అసెట్ అని, పక్కాగా ఈ మూవీ కమర్షియల్ హిట్ అవుతుందని అంటున్నారు. ఇంటర్వెల్ ట్విస్ట్, నరేష్ యాక్టింగ్, 'నాలో ఇన్నాళ్ళుగా' సాంగ్ స్క్రీన్ ప్లే సినిమాలో పాజిటివ్ పాయింట్స్ అని ఇప్పటిదాకా అందిన రిపోర్ట్స్ ద్వారా తెలుస్తోంది. మరికాసేపట్లో 'తెలుగు సమయం' పూర్తి రివ్యూ మీ ముందుకు తీసుకురాబోతున్నాం.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3Dl0fgY

No comments:

Post a Comment

'Budget Gives Middle Class Some Breathing Room'

'But this Budget alone will not fix what ails the Indian economy.' from rediff Top Interviews https://ift.tt/3EZi7XD