Sunday, 22 August 2021

Bholaa Shankar : రాఖీ స్పెషల్.. చిరుకు సోదరిగా కీర్తి సురేష్

మెగాస్టార్ బర్త్ డే (ఆగస్ట్ 22) సందర్భంగా అదిరిపోయే అప్డేట్లు వస్తున్నాయి. సర్ ప్రైజ్‌ల మీద సర్ ప్రైజ్‌లు వచ్చి పడుతున్నాయి. మొత్తంగా మూడు నాలుగు సినిమాల పోస్టర్లు, అప్డేట్లతో సోషల్ మీడియాలో షేక్ అవుతోంది. నేటి ఉదయం మహేష్ బాబు చేతులు మీదుగా వదిలిన వేదాళం రీమేక్ మూవీ పోస్టర్ ఓ రేంజ్‌లో వైరల్ అవుతోంది. చిరంజీవి ‘’గా చూపించబోతోన్నారు. ఈ మేరకు వదిలిన టైటిల్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. అయితే తాజాగా మరో అప్డేట్‌ను వదిలింది చిత్రయూనిట్. అందరూ ఊహించినట్టుగానే భోళా శంకర్ చిత్రంలో చిరుకు చెల్లిగా నటించబోతోన్నారు. రాఖీ సందర్భంగా ఈ మూవీ నుంచి అదిరిపోయే వీడియోను వదిలారు. అన్నయ్య చిరుకు కీర్తి సురేష్ రాఖీ కడుతున్న వీడియోను వదిలారు. అయితే ఈ పాత్రకు సంబంధించిన ఇప్పటికే ఎన్నో రూమర్లు వచ్చాయి. ఈ పాత్ర కోసం ముందుగా సాయి పల్లవిని కూడా సంప్రదించారనే టాక్ వచ్చింది.కానీ చివరకు ఆ లక్ కీర్తి సురేష్‌ను వరించింది. అయితే ఇప్పటికే కీర్తి సురేష్ సూపర్ స్టార్ రజినీ అన్నాత్తె సినిమాలో చెల్లిగా నటిస్తున్నారు. రజినీకాంత్‌కు చెల్లిగా నటించడంతో.. భోళా శంకర్ టీంకు కూడా ఆ ఆలోచన వచ్చినట్టుంది. అందుకే చిరుకు సోదరిగా నటించేందుకు కీర్తి సురేష్‌ను సంప్రదించారట. ఆమె వెంటనే చిరు చెల్లిగా నటించేందుకు ఒప్పుకున్నారట. మొత్తానికి ఈ రాఖీ సందర్భంగా భోళా శంకర్ నుంచి అదిరిపోయే అప్డేట్ మాత్రం వచ్చింది. ఇక వేదాళం రీమేక్‌గా రాబోతోన్న ఈ మూవీలో అన్నాచెల్లెళ్ల రిలేషన్ అదిరిపోనుంది. మాస్‌కు కావాల్సిన యాక్షన్ పార్ట్, ఫ్యామిలీకి కావాల్సిన ఎమోషన్ అన్నీ కూడా ఇందులో ఉండబోతోన్నాయి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3j6K8vv

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....