Sunday 22 August 2021

Akira Nandan : ఉత్తేజ్ కూతురు అలా అకీరా నందన్ ఇలా.. రేణూ దేశాయ్ కామెంట్స్ వైరల్

సోషల్ మీడియాలో షేర్ చేసే పోస్ట్‌లు ఎంతగానో వైరల్ అవుతుంటాయి. మరీ ముఖ్యంగా అకీరా నందన్‌కు సంబంధించిన విషయాలు హాట్ టాపిక్ అవుతుంటాయి. అకీరా విషయాలపై పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎక్కువగా ఆసక్తిని చూపుతుంటారు. రేణూ దేశాయ్ ఎప్పుడైనా లైవ్‌లోకి వస్తే అకీరా గురించి ప్రస్తావిస్తుంటారు. ఆమె ఫాలోవర్లు సైతం ఎక్కువగా అకీరాకు సంబంధించిన విషయాలే అడుగుతుంటారు. ఆ మధ్య రేణూ దేశాయ్ ఓ వీడియోను షేర్ చేశారు. అందులో అకీరా కర్రసాము చేస్తున్నారు. ఆ వీడియోలో అకీరా నైపుణ్యం చూసి అందరూ ఫిదా అయ్యారు. ఇక సినిమా ఎంట్రీకి సిద్దమవుతున్నారనే టాక్ కూడా వచ్చింది. వాటిపై రేణూ దేశాయ్ స్పందించారు. అకీరా ఇంకా చిన్న పిల్లవాడే.. ఇప్పుడైతే సినిమాల్లోకి వచ్చే ఉద్దేశ్యం లేదని రేణూ దేశాయ్ క్లారిటీగా చెప్పారు. అకీరా ఇంట్రెస్ట్ వేరు అని.. ఇంజనీరింగ్ కూడా చేయడని, సంగీతం అంటే ఎక్కువగా ఇష్టమని.. అందులోనే మాస్టర్స్ చేస్తాడని రేణూ దేశాయ్ తెలిపారు. ఓ సారి అకీరా పియానో వాయించాడు. ఆయన అలా పియానో వాయించడంతో రేణూ దేశాయ్ మురిసిపోయారు. అయితే తాజాగా ఉత్తేజ్ కూతురు రేణూ దేశాయ్ ఇంటికి వచ్చినట్టుంది. ఉత్తేజ్ కూతురు పాట.. ఆలిపిస్తున్న పాటకు అకీరా సంగీతాన్ని అందించాడు. ఒకవైపు పాట.. తన గాత్ర ప్రతిభను ప్రదర్శిస్తుంటే.. అకీరా తన సంగీత నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఆ వీడియోను రేణూ దేశాయ్ షేర్ చేస్తూ మురిసిపోయారు. మొత్తానికి అకీరా మాత్రం భవిష్యత్తులో తన సంగీతంతో అందరినీ మైమరిపించేలా ఉన్నాడు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/385awj6

No comments:

Post a Comment

'Preparing to enter affordable housing loans space'ns'

'Focus will be on smaller loan amounts to meet the needs of affordable homebuyers.' from rediff Top Interviews https://ift.tt/J1zq...