Monday, 25 January 2021

RRR పోస్టర్‌‌పై కాపీ ఆరోపణలతో రచ్చ.. ఆ సినిమా నుంచి తీసుకున్నారంటూ రాజమౌళిపై ట్రోల్స్.. ఇదీ సంగతి!

ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టు నుంచి నిన్న (జనవరి 25) అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు . ఈ సినిమా రిలీజ్ ఎప్పుడెప్పుడా అని క‌ళ్ళ‌ల్లో ఒత్తులు వేసుకొని చూస్తున్న మెగా, నందమూరి అభిమానులను సర్‌ప్రైజ్ చేస్తూ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించారు. ఈ మేరకు కొత్త పోస్టర్‌ను కూడా వదిలారు జక్కన్న. ఈ పోస్టర్ ప్రేక్షకలోకాన్ని విశేషంగా ఆకట్టుకున్నప్పటికీ ఓ వర్గం వాళ్ళు మాత్రం ఇది కాపీ అంటూ మొదలుపెట్టారు. దీంతో ఈ ఇష్యూ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. టెక్నాలజీ బాగా పెరగడం కారణంగా ఏదైనా పెద్ద సినిమా వస్తుందంటే చాలు ఆ సినిమాకు, గతంలో విడుదలైన సినిమాలకు ఏమైనా పోలికలున్నాయా? అనే వెతికేవారు మరీ ఎక్కువైపోయారు. ఏ చిన్న పాయింట్ దొరికినా కాపీ ఆరోపణలు తెరపైకి తెస్తున్నారు. తాజాగా RRR పోస్టర్ విషయంలోనూ అదే జరిగింది. జక్కన్న విడుదల చేసిన తాజా పోస్టర్ కాపీ అంటూ ఆన్‌లైన్ వేదికలపై రచ్చ స్టార్ట్ చేశారు కొందరు నెటిజన్లు. అక్టోబర్ 13వ తేదీన RRR మూవీని గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నామని తెలుపుతూ మెగా, నందమూరి ఫ్యాన్స్ ఖుషీ అయ్యేలా పోస్టర్ వదిలారు రాజమౌళి. ఈ పోస్టర్‌లో గుర్రంపై వెళుతున్నట్లు ఉండగా, ఎన్టీఆర్ బైక్‌పై జెట్ స్పీడుతో దూసుకెళ్తున్నట్లు కనిపిస్తోంది. దీంతో ఈ పోస్టర్ వైరల్ కావడం, అంతా బాగానే ఉంది అనుకుంటుండగానే ఇది కాపీ అనే ఆరోపణలు రావడం సంచలనంగా మారింది. ఈ పోస్టర్ హాలీవుడ్ మూవీ 'ఘోస్ట్ రైడర్' నుంచి కాపీ చేశారంటూ ఓ వర్గం నెటిజన్లు రాజమౌళిపై ట్రోలింగ్ చేస్తున్నారు. చూడాలి మరి ఈ ఇష్యూపై జక్కన్న టీమ్ ఎలా స్పందిస్తుందో!.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2YbkURg

No comments:

Post a Comment

'Child Marriage Is Nothing But Child Rape'

'People don't believe that a 15-year-old girl subjected to sexual intercourse within a marriage is a victim of rape.' from red...