Friday, 1 January 2021

RGV హారర్ మూవీ 12'O Clock ట్రైలర్.. ఒక్క డైలాగ్ కూడా లేకుండా భయపెట్టిన వర్మ

ఎప్పటికప్పుడు ట్రెండ్ ఫాలో అవుతూ సినిమాలు రూపొందిస్తున్న వివాదాస్పద డైరెక్టర్ మరోసారి రివర్స్ గేర్ వేసి తిరిగి తన రెగ్యులర్ ట్రాక్ లోకి వెళ్లారు. హారర్ సినిమాలతో భయపెట్టేందుకు రెడీ అవుతున్నారు. ఇది షార్ట్ ఫిలిం కాదు. ఫుల్ లెంగ్త్ సినిమా అని ముందే ప్రకటించిన ఆయన అప్‌డేట్స్‌తో సినిమాపై ఆసక్తి రేకెత్తిస్తున్నారు. 12'O Clock ట్రైలర్- 2 అంటూ వీడియో వదిలిన రామ్ గోపాల్ వర్మ.. ఈ రెండు నిమిషాల ట్రైలర్ లో ఒక్క డైలాగ్ కూడా పెట్టకుండా భయపెట్టేశారు. కేవలం హారర్ దృశ్యాలతో ఈ ట్రైలర్ నడిపించడం విశేషం. వేగంగా డెవలప్ అవుతున్న సైన్సుకు, ఆత్మలకు ఏదైనా సంబంధం ఉందా? అనే అంశం ఆధారంగా ఈ మూవీ రూపొందుతోంది. ఈ సినిమాలో మకర్‌దేశ్‌ పాండే, మిథున్‌ చక్రవర్తి, ఆశిష్‌ విద్యార్థి, దిలీప్‌ తాహిల్‌, మానవ్‌ కౌల్‌, అలీ అజగర్‌, తదితరులు నటించారు. సినిమాటోగ్రఫీ అమోల్‌ రాథోడ్‌ అందించారు. జనవరి 8వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తుండటం స్పెషల్ అట్రాక్షన్.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3o6AfOv

No comments:

Post a Comment

The Manmohan Singh Interview You Must Read

'We are going to need more technical people in government.' from rediff Top Interviews https://ift.tt/CkfAJzb