Friday, 1 January 2021

రజినీ నా జీవితం.. ఇదే నా ఆఖరి పోస్ట్.. తెల్లారే సరికి విగతజీవిగా అభిమాని

సూపర్ స్టార్ తన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని తాను రాజకీయాల్లోకి రావడం లేదని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని రజినీ శ్రేయోభిలాషులు స్వాగతిస్తుండగా.. ఆయన అభిమానులు మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. తమ హీరో రాజకీయాల్లోకి రావాలని ఎప్పుటినుంచో ఎదురుచూస్తున్న అభిమానులు తీవ్ర నిరాశతో ఉన్నారు. ఈ క్రమంలో ఒక అభిమాని ఆత్మహత్య చేసుకున్నాడనే ఆరోపణలు వస్తున్నాయి. తమిళనాడులోని పానంపట్టుకు చెందిన 34 ఏళ్ల రజినీకాంత్ అభిమాని బలవన్మరణానికి పాల్పడ్డాడని ఆరోపణ. వివరాలు ఇలా ఉన్నాయి.. జె.రాజ్‌కుమార్ అనే రజినీకాంత్ అభిమాని బుధవారం ఫేస్‌బుక్‌లో ఒక పోస్ట్ పెట్టాడు. రజినీకాంత్ నిర్ణయంపై నిరాశ వ్యక్తం చేస్తూ ‘‘రజినీ నా జీవితం.. ఇదే నా ఆఖరి పోస్ట్’’ అని ఎఫ్‌బీ పోస్ట్‌లో పేర్కొన్నాడు. ఆరోజు రాత్రి స్నేహితులతో కలిసి రాజ్‌కుమార్ బాగా మద్యం సేవించాడు. ఆ సమయంలో రాజ్‌కుమార్‌ను స్నేహితులంతా అతన్ని ఆటపట్టించినట్టు సమాచారం. అతడి ఫేవరెట్ హీరో రజినీకాంత్ తీసుకున్న నిర్ణయంపై రాజ్‌కుమార్‌ను ఏడిపించారట. రాత్రి ఇంటికి వెళ్లిన రాజ్‌కుమార్ గురువారం ఉదయం ఇంట్లో శవమై కనిపించాడు. అయితే, ఆత్యహత్య ఆరోపణలను పోలీసులు ఖండిస్తున్నారు. రాజ్‌కుమార్‌ది ఆత్యహత్య కాదని మూర్చతో చనిపోయాడని అంటున్నారు. ‘‘రాజ్‌కుమార్‌కు మూర్చ వ్యాధి ఉంది. బుధవారం రాత్రి తన స్నేహితులతో కలిసి అంత్యక్రియలకు పూలమాలలు కొనడానికి వెళ్లాడు. అక్కడ అతడికి మూర్చ వచ్చింది. అతను హాస్పిటల్‌లో చనిపోయాడు. అతడి కుటుంబ సభ్యులు ఎలాంటి కేసు నమోదు చేయలేదు. ఇంకా పోస్టుమార్టం కూడా నిర్వహించలేదు. అయితే, అతడి ఫేస్‌బుక్ పోస్ట్‌పై మాత్రం అనుమానాలు ఉన్నాయి’’ అని పోలీసులు వెల్లడించారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/38Strh2

No comments:

Post a Comment

'Never Be Another Zakir Hussain'

'Zakir <em>bhai</em> always said, '<em>koi chala nahi jata hai</em>', he believed even after death, you ...