గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మ అవార్డులను అనౌన్స్ చేసిన కేంద్ర ప్రభుత్వం గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు దేశ రెండో అత్యుత్తమ పౌరపురస్కారం పద్మ విభూషణ్ అవార్డును ప్రకటించింది. మరణానంతరం ఆయనను ఈ అవార్డు వరించింది. ఎస్పీబీకి రావడం పట్ల సినీ ప్రముఖులంతా సంతోషం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయిన మెగాస్టార్ .. ఎస్పీబీకి పద్మవిభూషణ్ వరించడంపై తన స్పందన తెలియజేశారు. నా ప్రియాతి ప్రియమైన సోదరుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు రావడం ఎంతో ఆనదాన్నిస్తోందని పేర్కొన్న చిరంజీవి.. మరణానంతరం అనే ఒక్క పదం చూస్తుంటేనే ఎంతో బాధగా అనిపిస్తోందంటూ సందేశం పోస్ట్ చేశారు. కాకపోతే బాలు లేరనే విషయం మనందరం జీర్ణించుకోక తప్పదంటూ ఎమోషనల్ కామెంట్ చేశారు చిరు. ఈ మేరకు చిరునవ్వుతో కూడిన ఫొటోను ఆయన పంచుకున్నారు. 2021 సంవత్సరానికి గాను ఏడుగురికి పద్మవిభూషణ్, 10 మందికి పద్మభూషణ్, 102 మందికి పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఇందులో టాలీవుడ్ నుంచి ముగ్గురు గాయకులు ఎంపికయ్యారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (పద్మవిభూషణ్), చిత్ర (పద్మభూషణ్), మరో గాయని బోంబే జయశ్రీ (పద్మశ్రీ) లకు అవార్డులు దక్కాయి. గతంలో కూడా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంను 2001 సంవత్సరంలో పద్మశ్రీ, 2011 సంవత్సరంలో పద్మభూషణ్ అవార్డులు వరించాయి.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3sZmDrd
No comments:
Post a Comment