Monday, 25 January 2021

పవన్ కళ్యాణ్ గ్రాండ్ ఎంట్రీ.. షూటింగ్ లొకేషన్‌లో‌ త్రివిక్రమ్‌‌తో పవర్ స్టార్ అలా!! వీడియో వైరల్

మ‌ల‌యాళీ హిట్ మూవీ 'అయ్యప్పనుమ్ కోషియమ్' తెలుగు రీమేక్ షూటింగ్ ప్రారంభమైంది. ఈ సినిమా సెట్స్ పైకి పవర్ స్టార్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 12గా రాబోతున్న ఈ మూవీ షూటింగ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రత్యక్ష పర్యవేక్షణలో జరగనుంది. రిపబ్లిక్ డే సందర్భంగా ఫస్ట్ డే షూటింగ్ తాలూకు సన్నివేశాలతో కూడిన ఓ వీడియోను పంచుకుంది చిత్రయూనిట్. ఇందులో త్రివిక్రమ్‌తో షూటింగ్ లొకేషన్‌పై పవర్ స్టార్ నడక చూసి ఫిదా అవుతున్నారు మెగా అభిమానులు. షూటింగ్ లొకేష‌న్‌లో పవన్ కళ్యాణ్ అడుగుపెట్ట‌డం, చిత్ర ద‌ర్శ‌కుడు సాగర్ కె. చంద్ర అలాగే త్రివిక్ర‌మ్‌తో మంత‌నాలు చేయ‌డం, ఫైన‌ల్‌గా బుల్లెట్‌పై పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇస్తుండటం లాంటి సీన్స్ ఈ వీడియోలో చూపించారు. దీంతో ఈ వీడియో క్షణాల్లో వైరల్‌గా మారింది. పవర్ స్టార్ కెరీర్‌లోనే ఈ మూవీ బిగ్గెస్ట్ హిట్ కావడం ఖాయమంటూ కామెంట్స్ చేస్తున్నారు ఈ వీడియో చూసిన నెటిజన్లు. హైదరాబాద్ లోని లింగంపల్లి అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రారంభమైన ఈ మూవీ తొలి షెడ్యూల్‌లో భాగంగా పలు యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ పూర్తిచేయనున్నారట. ఫైట్ మాస్టర్ దిలీప్ సుబ్బరాయన్ నేతృత్వంలో పది రోజులపాటు పవన్, రానాలపై యాక్షన్ సీన్స్ షూట్ చేస్తారని తెలిసింది. మరికొద్ది రోజుల్లో హీరోయిన్స్ సాయి పల్లవి, ఐశ్వర్య రాజేష్ కూడా ఇందులో జాయిన్ కాబోతున్నారట. ముందుగా షూట్ చేయనున్న ఈ సన్నివేశాలు సినిమాలో చాలా కీలకం కానున్నాయని సమాచారం. సాగ‌ర్ కె చంద్ర ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే- సంభాషణలు అందిస్తుండగా.. ఈ మధ్యకాలంలో సంగీత ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తున్న థమన్ బాణీలు కడుతున్నారు. సముద్రఖని, మురళీశర్మ, బ్రహ్మాజీ, నర్రా శ్రీను తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/36cQlPM

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....