Tuesday, 20 October 2020

సొనూసూద్ స్పెషల్ రిక్వెస్ట్.. ఉప్పల్ వాసికి ఉచితంగా ఆపరేషన్

సినీనటుడు సోనూసూద్ చేస్తున్న సాయం గురించి ప్రస్తుతం దేశమంతా చెప్పుకుంటోంది. కరోనా లాక్ డౌన్ సమయంలో వలస కార్మికుల విషయంలో ఆయన చేసిన సాయం చూసి దేశప్రజలంతా కొనియాడారు. వలస కార్మికులు అయితే సోనూ సూద్‌ను దేవుడితో సరిపోల్చారు. ఆ తర్వాత ఆయన ఎవరికీ ఎక్కడ ఎలాంటి కష్టం వచ్చిన నేనున్నానంటూ అక్కడ తన సాయాన్ని అందించారు. దీంతో సోనూ రియల్ హీరో అంటూ ప్రజలంతా ప్రశంసలు అందించారు. అయితే తాజాగా సోనూ చేసిన రిక్వెస్ట్‌తో ఓ ఆస్పత్రి పేషెంట్‌కు ఉచిత సాయం అందించింది Read More: ‌ ట్విట్టర్‌ ద్వారా చేసిన వినతి మేరకు ఉప్పల్‌ నివాసి జయమ్మ(62) మోకాలిచిప్ప మార్పిడి చేశామని డా.విజయభాస్కర్‌ తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌ దోమలగూడలోని రవి పీలియోస్‌ ఆసుపత్రిలో శస్త్ర చికిత్స జరిగిందని ఆయన చెప్పారు. ఈ శస్త్రచికిత్సకు రూ.2 లక్షల వ్యయం అవుతుందని పేర్కొన్నారు. సోనూసూద్‌ చేస్తున్న సేవలను గౌరవించి తాము ఉచితంగా శస్త్రచికిత్స చేశామన్నారు. ప్రస్తుతం జయమ్మ కోలుకుంటున్నారని త్వరలో నడుస్తారని ఆయన వివరించారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/34fU0LW

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....