Thursday 18 June 2020

HBD Kajal Aggarwal: మోడల్ నుంచి మేడం టుస్సాడ్స్ వరకు! అమ్మడి క్వాలిటీస్ చూస్తే..

నేడు (జూన్ 19) హీరోయిన్ . 1985 సంవత్సరం సరిగ్గా ఇదే రోజు ముంబైలో జన్మించిన ఈ బ్యూటీ.. నేటితో 35 యేళ్లు పూర్తి చేసుకొని 36వ యేట అడుగుపెడుతోంది. ఈ సందర్భంగా కాజల్‌కి ప్రత్యేకంగా తెలుగు సమయం తరఫున బర్త్ డే విషెస్ తెలుపుతూ ఆమె సినీ జర్నీలోని కొన్ని ముఖ్యమైన విశేషాలు, హిట్ సినిమాలపై ఓ లుక్కేద్దామా.. మోడల్ గా కెరీర్ ఆరంభించి అంచెలంచెలుగా ఎదిగింది కాజల్ అగర్వాల్. బాలీవుడ్ మూవీ ‘క్యూ హో గయా నా’ సినిమాలో చిన్న పాత్రలో వెండితెరకు పరిచయమై, ఆ తర్వాత తెలుగు, తమిళ భాషా చిత్రాల్లో నటించింది. తెలుగులో తేజ దర్శకత్వంలో రూపొందిన 'లక్ష్మీ కళ్యాణం' సినిమాతో హీరోయిన్‌గా పరిచయమై సౌత్ ఇండియన్ సినిమాల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించింది. దాదాపు 15 ఏళ్లుగా కెమెరా ముందు రాణిస్తున్న కాజల్.. అందరు అగ్ర హీరోల సరసన నటించింది. అంతేకాదు 50 సినిమాల మార్క్ కూడా దాటేసిన హీరోయిన్‌గా గుర్తింపు పొందింది. తెలుగులో 'చందమామ' సినిమాలో ఆకట్టుకొని ఫేమ్ సంపాదించిన కాజల్.. ఆ తర్వాత రామ్ చరణ్ హీరోగా వచ్చిన 'మగధీర' మూవీలో మెరిసి స్టార్ హీరోయిన్‌గా కీర్తించబడుతోంది. అందంతో పాటు ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోగల నటనా ప్రతిభ ఉండటంతో సినీ ప్రస్థానం నేటికీ కొనసాగుతూనే ఉంది. ఎంతమంది కొత్త హీరోయిన్ వచ్చినా ఆమె డిమాండ్ ఆమెదే. చిరంజీవి రీ ఎంట్రీ హీరోయిన్‌గా ‘ఖైదీ నంబర్ 150’లో ఆయనతో రొమాన్స్ చేసింది కాజల్. అలా తండ్రీకొడుకులు చిరంజీవి,రామ్ చరణ్ సరసన నటించిన హీరోయిన్‌గా కూడా అమ్మడికి స్పెషల్ పాపులారిటీ ఉంది. ప్రస్తుతం సీనియర్, జూనియర్ హీరోలందరికీ బెటర్ ఛాయిస్‌గా ఉన్న ఈ ముద్దుగుమ్మ చిరంజీవితో 'ఆచార్య' సినిమాలో, కమల్ హాసన్‌తో 'భారతీయుడు 2' మూవీలో అలాగే మంచు విష్ణు సరసన 'మోసగాళ్లు' మూవీలో నటిస్తోంది. ఇకపోతే వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల మైనపు విగ్రహాలను తయారు చేసి, వాటికి సజీవ రూపం ఇచ్చే మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో కాజల్ అగర్వాల్ విగ్రహాన్ని ఉంచడం అమ్మడికి దక్కిన అరుదైన గౌరవం. ఈ మ్యూజియంలో స్థానం సంపాదించిన తొలి సౌత్ ఇండియన్ హీరోయిన్‌గా కాజల్ రికార్డు సృష్టించింది. అమితాబ్, హృతిక్, ఐశ్వర్య, షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, మహేష్ బాబు, ప్రభాస్, కాజోల్, కరీనా కపూర్ విగ్రహాలతో పాటు కాజల్ విగ్రహాన్ని ఉంచడం విశేషం.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3fD0aZh

No comments:

Post a Comment

Exclusive! The IPL Chairman Reveals All

'Whichever teams have the best players they get a chance to retain them.<br>'There is a lot of scope for new players to come i...