Wednesday 24 June 2020

హీరోయిన్ పూర్ణకు బెదిరింపులు.. నలుగురు యువకులు అరెస్ట్

టాలీవుడ్ హీరోయిన్ వచ్చాయి. లాక్ డౌన్‌తో ఆమె సొంత రాష్ట్రమైన కేరళలోనే ఆమె గత కొన్ని రోజులుగా ఉంటున్నారు. అయితే పూర్ణను టార్గెట్ చేసిన నలుగురు వ్యక్తులు సోషల్ మీడియా ద్వారా ఆమెపై బెదిరింపులకు దిగారు. తాము డిమాండ్ చేసిన మొత్తం ఇవ్వాలని ఆమెను బెదిరించారు. దీంతో పూర్ణ, ఆమె కుటుంబసభ్యులతో కలిసి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టి డబ్బులు డిమాండ్ చేస్తున్న నలుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేశారు. అరెస్టైన నలుగురు నిందితుల వివరాలను మరడు పోలీసులు వెల్లడించారు. అరెస్టైన వారిలో అష్రఫ్, రఫీఖ్, శరత్, రమేశ్ ఉన్నారు. నలుగురూ నటిని బెదిరిస్తూ బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. నిందితులు నలుగురికీ జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. గతంలో కూడా వీరు ఇతర ప్రముఖులను ఇలాగే బ్లాక్ మెయిల్ చేశారని పోలీసులు దర్యాప్తులో తేలినట్లు సమాచారం. పూర్ణ అసలు పేరు శ్యామ్నా కాసిం. ఆమెది కేరళ. పుట్టింది పెరిగింది చదివింది అంతా కేరళలోనే. 2007లో వచ్చిన శ్రీ మహాలక్ష్మీ సినిమాతో ఆమె తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత అల్లరి నరేష్‌తో కలిసి సీమ టపాకాయ్ చిత్రంలో జత కటటింది. 2012లో వచ్చిన అవును సినిమాతో పూర్ణ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. దెయ్యాల సినిమాల్లో ఆమె ప్రత్యేకంగా నిలిచింది. అవును2, రాజు గారి గది 2లో కూడా పూర్ణ నటించింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2YwrjaQ

No comments:

Post a Comment

'Don't Involve My Family!'

'My weakness is my family, and the people I love.' from rediff Top Interviews https://ift.tt/2lOucDz