Wednesday 24 June 2020

రెండేళ్ల పాటు అదే అనుభవం.. ఆత్మహత్యే శరణ్యమని భావించా: 'బిగ్ బాస్' బ్యూటీ సంచలన వ్యాఖ్యలు

ఇటీవలే బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకోవడం యావత్ చిత్ర పరిశ్రమను ఓ కుదుపు కుదిపేసింది. ఎంతో భవిష్యత్ ఉన్న యువ నటుడి బలవన్మరణాన్ని ఎవ్వరూ జీర్ణించుకోలేకపోయారు. అయితే ఆయన మరణానికి కారణం డిప్రెషన్ అని తెలియడం, పైగా వృత్తి జీవితంలో ఏర్పడ్డ కొన్ని సమస్యల కారణంగానే ఆయన డిప్రెషన్‌ లోకి వెళ్లారని వార్తలు రావడంతో ఈ ఇష్యూ చిత్ర వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీంతో చిత్ర సీమలో నెపోటిజం, డిప్రెషన్ లాంటి అంశాలపై ఒక్కొక్కరుగా తమ అనుభవాలు చెబుతూ బాధను వెళ్లగక్కుతుండటం ఎన్నో అనుమానాలకు తెరలేపుతోంది. ఈ నేపథ్యంలోనే నటి, ‘’ ఫేమ్ తాజా ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలు బయటపెట్టింది. తన జీవితంలో ఎదుర్కొన్న డిప్రెషన్ గురించి చెబుతూ ఒకానొక టైమ్‌లో సూసైడ్ చేసుకోవాలని కూడా డిసైడ్ అయినట్లు పేర్కొంది. వృత్తి పరంగా అవకాశాలు రాక రెండేళ్లపాటు తీవ్ర ఒత్తిడికి లోనయ్యానని, చివరకు ఇంటి టెర్రస్పై నుంచి దూకి సూసైడ్ చేసుకోవాలని అనుకున్నానని, ఆ సమయంలోనే 'బిగ్ బాస్' ఆఫర్ రావడంతో పరిస్థితులు మారిపోయాయని ఆమె చెప్పుకొచ్చింది. Also Read: ''2015 సంవత్సరంలో ‘మోసగాళ్లకు మోసగాడు’లో హీరోయిన్గా ఛాన్స్ వచ్చింది. అయితే ఆ సినిమా ఆశించిన ఫలితం రాబట్టకపోవడంతో ఆఫర్స్ తగ్గాయి. దీంతో తీవ్ర డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఆత్మహత్యే దారి అనుకున్నా. అనంతరం బిగ్ బాస్ రూపంలో వచ్చిన అవకాశం నన్ను మార్చేసింది. బిగ్‌బాస్ తర్వాత అలాంటి ఆలోచనలకు స్వస్తి చెప్పి దృడంగా తయారయ్యాను. తరచూ ఫ్రెండ్స్‌తో మాట్లాడటం, డాక్టర్స్ వద్ద కౌన్సిలింగ్ తీసుకోవడంతో పరిస్థితుల్లో మార్పు వచ్చింది'' అని నందినీరాయ్ పేర్కొంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/31luAeC

No comments:

Post a Comment

'Kashmir Needs A Bal Thackeray'

'Afzal Guru became a victim of Pakistan's conspiracy. He was used as a means, just like all other innocent Kashmiris.' from re...