Wednesday, 1 September 2021

Power Star Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌ని పవర్ స్టార్ చేసింది ఆ సినిమానే.. పోసాని కృష్ణమురళి హస్తం! ఇదీ అసలు రహస్యం

తెలుగు సినీ పరిశ్రమలో అంటే అదో క్రేజ్. ఆయన సినిమాలంటే జనానికి పిచ్చి. పవన్ డైలాగ్స్ వింటుంటే ఉరకలేసే ఉత్సాహం. మెగా హీరోగా, చిరంజీవి తమ్ముడిగా సినీ గడపతొక్కిన పవన్ కళ్యాణ్ 'అన్నయ్య'కు తగ్గ 'తమ్ముడు' అయ్యారు. మెగా అభిమానలోకాన్ని రెట్టింపు చేయడమే గాక తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. పవర్ స్టార్‌గా మరే హీరోకు అందనంత ఎత్తుకు ఎదిగి కోట్లాదిమంది గుండెల్లో గూడుకట్టుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్‌ని అని పిలవడం వెనుక, ఆ బిరుదు రావడం వెనుక ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ దాగి ఉంది. పవర్ స్టార్.. పవర్ స్టార్ అంటూ ఊగిపోతుంటారు ఆయన ఫ్యాన్స్. మరి పవర్ స్టార్ అని ఎందుకంటున్నారు. ఆ బిరుదు రావడానికి కారణమేంటి? ఆ సీక్రెట్ చూస్తే.. సినీ గడప తొక్కకముందు పవన్ కళ్యాణ్‌ని అంతా కళ్యాణ్ బాబు అనేవారు. తన చిన్న అన్నయ్య నాగబాబుతో కలిసి అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్‌లో నిర్మించిన పలు చిత్రాలకు సహ నిర్మాతగా వ్యవహరించారు పవన్. ఆ తర్వాత అన్నయ్యలు, వదిన సురేఖ ప్రోత్సాహంతో సినిమా హీరోగా ఆరంగేట్రం చేసి ఏ హీరోకూ దక్కనంత క్రేజ్ దక్కించుకున్నారు. 1996 సంవత్సరంలో గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై ఇవివి సత్యనారాయణ దర్శకత్వం వహించిన ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి రావడం రావడమే కెమెరా ముందు తన మార్షల్ ఆర్ట్ సత్తాను చూపించారు పవన్. ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాకపోయినా పవన్ టాలెంట్ బయటపెట్టింది. ఆ తర్వాత 'గోకులంలో సీత' సినిమాతో మంచి విజయాన్ని ఖాతాలో వేసుకొని గుర్తింపు పొందారు. ఈ సినిమానే పవన్ కళ్యాణ్‌ని పవర్ స్టార్ చేసేసింది. 'గోకులంలో సీత' సినిమాకు మాటలు రాసిన రచయిత, నటుడు తొలిసారి పవన్ కళ్యాణ్‌ని పవర్ స్టార్ అని సంబోధించారు. ఈ చిత్ర విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పోసాని అలా అన్నారు. దీంతో పలు మీడియా కథనాల్లో పవన్ కళ్యాణ్ పేరుకు ముందు పవర్ స్టార్ బిరుదుతో కథనాలు రావడం, ఆ తర్వాత సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌‌పై వచ్చిన ‘సుస్వాగతం’ సినిమాకు తొలిసారిగా పవన్ కళ్యాణ్ పేరు ముందు పవర్ స్టార్ బిరుదుతో టైటిల్ కార్డ్ వేయడం జరిగింది. ఇక అప్పటినుంచి వెండితెరపై వెనుతిరిగి చూడలేదు పవన్ కళ్యాణ్. పవర్ స్టార్‌గా భారీ విజయాలందుకొని బాక్సాఫీస్ లెక్కలు మార్చేశారు. సింగర్‌గా, స్టంట్ కొరియోగ్రాఫర్‌గా, డ్యాన్స్ మాస్టర్‌గా, డైరెక్టర్‌గా, స్క్రీన్‌ప్లే రైటర్‌గా, నిర్మాతగా అన్ని కోణాల్లో రాణించి ఇప్పుడు జనసేనానిగా జనం వెంట నడుస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3BNWPC3

No comments:

Post a Comment

''Have Muslims Faced Problems In Maharashtra?'

'We have given riot-free Maharashtra in our 18-month rule.' from rediff Top Interviews https://ift.tt/pLavVg8