నాగచైతన్య, సాయిపల్లవి, శేఖర్ కమ్ముల కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం ‘లవ్‌స్టోరి’ . సెప్టెంబర్ 24న విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌తో వసూళ్లను రాబట్టుకుంటోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఓవర్ సీస్‌లోనూ సినిమా దూసుకెళ్తోంది. ఈ సినిమా సక్సెస్‌పై ఎంటైర్ యూనిట్ ఎంతో హ్యాపీగా ఉంది. అంతా బాగానే ఉంది. మజిలీ సక్సెస్ తర్వాత నాగచైతన్యకు వచ్చిన మరో సక్సెస్. ఈ సక్సెస్‌ను నాగచైతన్య అండ్ టీమ్ కంటే మరో వ్యక్తి ఎక్కువగా ఎంజాయ్ చేస్తున్నారు. అదెవరో కాదు.. అక్కినేని నాగార్జున. శుక్రవారం హిట్ టాక్ వచ్చిన తర్వాత చిత్ర యూనిట్ సక్సెస్‌ను బాగా ఎంజాయ్ చేశారు. చిత్ర యూనిట్ బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ కోసం ప్రత్యేకమైన విందును ఏర్పాటు చేశారు. కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఆ సమయంలో లాల్ సింగ్ చద్దా సినిమాలో చైతన్య చేసిన పాత్రకు సంబంధించి సీక్రెట్‌ను బయట పెట్టేశాడు. అసలు విషయంలోకి వెళితే, ‘లాల్ సింగ్ చద్దా’లో చైతన్య పాత్ర పేరు బాలరాజు. యాదృచ్చికమైన విషయమేంటో తెలుసా? 70 సంవత్సరాల క్రితం అక్కినేని నట శిఖరం నాగేశ్వరరావు బాలరాజు పేరుతో సినిమా చేశారు. అది తలుచుకుని నాగ్ ఎమోషనల్ అయ్యారు. లాల్ సింగ్ చద్దా మూవీలో నాగచైతన్య పాత్ర పరిమితంగా ఉంటుంది. ఆ పాత్ర చనిపోతుందని, వారి కుటుంబాన్ని పరామర్శించడానికే ఆమిర్ ఖాన్ కాకినాడ వస్తాడట. రీసెంట్‌గా ఆ సన్నివేశాలను కాకినాడ, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతుంది. ఆమిర్ ఖాన్, ఈ క్రమంలోనే లవ్‌స్టోరి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు కూడా వచ్చిన సంగతి తెలిసిందే.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3ucz583
No comments:
Post a Comment