తొలి సినిమా ‘ఆర్ఎక్స్ 100’తోనే తన సత్తా నిరూపించుకున్న దర్శకుడు అజయ్ భూపతి ఇప్పుడు మరో విభిన్నమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. , సిద్ధార్త్ హీరోలుగా ఆయన ‘మహాసముద్రం’ అనే సినిమాని రూపొందిస్తున్నారు. రొటీన్ సినిమాల్లా కాకుండా ఓ డిఫరెంట్ కథతో ఈ సినిమా తెరకెక్కిస్తుంది. వైజాగ్ బ్యాక్‌డ్రాప్‌లో ఎ.కె.ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక దసరా కానుకగా సినిమాను అక్టోబర్ 14వ తేదీన విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కూడా ఘనంగా జరిగింది. ట్రైలర్‌లోని సన్నివేశాలు.. యాక్షన్ సీన్లు.. డైలాగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ట్రైలర్ చూసిన ప్రేక్షకుల్లో సినిమాపై మరింత అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమాతో శర్వానంద్, సిద్ధార్త్‌లకు సూపర్‌హిట్ గ్యారెంటీ అంటూ వాళ్లు కామెంట్ చేస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకు పాన్ ఇండియా స్టార్ మద్దతు లభించింది. శర్వానంద్ మరియు ప్రభాస్‌లు మంచి మిత్రులు అనే విషయం ఎప్పటి నుంచి తెలిసిందే. ప్రభాస్‌ని ప్రేమతో శర్వానంద్ ‘అన్న’ అని సంభోదిస్తుంటారు. రీసెంట్‌గా ఈ సినిమా ట్రైలర్‌పై ప్రభాస్ కామెంట్ చేశారు. ట్రైలర్ చాలా అద్భుతంగా, ఆసక్తికరంగా ఉంది అంటూ ఆయన పేర్కొన్నారు.ఈ సినిమా సూపర్ హిట్ కావాలి అంటూ చిత్ర యూనిట్ మొత్తానికి ఆయన విషెస్ తెలిపారు. ఈ పోస్ట్‌పై శర్వానంద్ కూడా రియాక్ట్ అయ్యారు. ‘థాంక్స్ అన్న’ అంటూ ఈ పోస్ట్‌కి ఆయన కామెంట్ చేశారు. ఇక ఈ సినిమాలో అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యయేల్‌లు హీరోయిన్‌లుగా నటిస్తుండగా.. రావు రమేష్, జగపతిబాబు తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. యువ సంగీత దర్శకుడు చైతన్ భరద్వాజ్ ఈ సినిమాకు సంగీతం సమకూర్చారు. తెలుగుతో పాటు తమిళ భాషలో కూడా ఈ సినిమా విడుదల అవుతున్నట్లు సమాచారం.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3CNP7If
No comments:
Post a Comment