గత నాలుగు దశాబ్దాలుగా అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన దిగ్గజ నటుడు . క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఓ అధ్యాయాన్ని క్రియేట్ చేసుకున్న గొప్ప నటుడు కోట. ఎంతోమంది దర్శకనిర్మాతలతో పని చేసిన అనుభవం ఆయన సొంతం. మూడు తరాల హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న ఆయన.. తాజాగా తన కెరీర్‌లో జరిగిన సంఘటనలపై ఓపెన్ అయ్యారు. నట జీవితంలోని విశేషాలను పంచుకుంటూ స్టార్ డైరెక్టర్ కృష్ణవంశీపై ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. '' ఓ సారి మీటింగ్‌లో మాట్లాడుతూ తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్టులు తక్కువయ్యారు అనడానికి నిదర్శనం ప్రకాష్ రాజ్‌కి ఈ ఏడాది రెండు నందులు రావడం అన్నారు. దాన్ని నేను ఖండించా. నువ్ సారీ చెప్పు ముందు అన్నా. అంటే నంది వస్తే అయిపోతుందా. చిరంజీవి లాంటి ఎంతోమంది అద్భుతమైన నటులున్నారు. స్వయం కృషితో ఎదిగి ఎరీనా క్రియేట్ చేసుకున్నారు. నంది అవార్డుకు కొన్ని రూల్స్ ఉంటాయి. కొన్ని పర్టికులర్ సినిమాలకు నందులు ఇస్తారు. అయితే నంది వస్తేనే గొప్పోళ్ళు అనుకుంటే ఎలా. అది తపయ్యా, అలా అనకూడదు అని కృష్ణవంశీతో అన్నా. దాంతో ఆయనేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడారు. చాలా రాష్‌గా ఇచ్చా. అతనే మళ్ళీ కావాలని కోటను పెట్టుకున్నాడు. ఊరికే వాళ్లకు వాళ్ళే నేను గ్రేట్. నేను క్రియేటివ్ డైరెక్టర్‌ని అనుకుంటే సరిపోతుందా? మీ లాంటి వాళ్ళు అనాలి'' అంటూ కాస్త సీరియస్ గానే మాట్లాడిన కోట శ్రీనివాసరావు ఆ తర్వాత కృష్ణవంశీ మంచి టాలెంట్ ఉన్న డైరెక్టర్ అని పొగిడారు. అప్పుడు కుర్రాడుగా అందుకే అలా ఆవేశపడి ఉంటారని తెలిపారు. ఆయన నూతనత్వంతో సినిమాలు చేసే క్రియేటివే కానీ అది మనం చెప్పుకోకూడదని కోట అన్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3sLSFHv
No comments:
Post a Comment